శాతవాహనులు – 1

1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు?
జ: ఇండికాలో-మెగస్తనీసు
2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు?
జ: సిముఖుడు
3) మౌర్యులకు సామంతుడు ఎవరు?
జ: సిముఖుడు
4) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
జ: కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
5) కోటి లింగాలలో ఏ నాణేలు లభించాయి?
జ: సమగోప, గోభద్ర, నారాణ, కంవమసర నాణేలు
6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి?
జ: రోమన్ సామ్రాజ్యం
7) శాతవాహనుల కాంలో ఏ విదేశీ నాణేలు లభించాయి?
జ: మస్తులాపూర్ లో రోమన్ నాణేలు (కరీంనగర్ జిల్లా)
8) కోటిలింగాల శాతవాహనుల రాజధాని అనడానికి ఆధారాలు ఏంటి?
జ: కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూర్, కోటిలింగాలలో నాణేలు, బౌద్దస్తూపాలు బయటపడ్డాయి
9) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి?
జ: మత్స్యపురాణం - వాయుపురాణం
10) ఎంతమంది రాజులను ఆంధ్రభృత్యులు అన్నారు?
జ: 30 మంది
11) కాళిదాసు రచించిన రచనలు ఏంటి?
జ: మాళవికాగ్ని మిత్రము
12) హాలుడు రచనలు ఏంటి?
జ: గాధా సప్తశతి
13) సిముఖుని పేరుతో నాణేలు ఎక్కడ దొరికాయి?
జ: జోగల్తంబి, తరహల, కోటిలింగాల (బిముఖ అని వాలిపై ఉన్నది)
14) మొత్తం ఎన్ని శాసనాలు బయటపడ్డాయి?
జ: 25 శాసనాలు
15) కోటి లింగాల దొరికిన నాణేలపై ఏమని రాసి ఉన్నది?
జ: బిముఖ
16) బిముఖ ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు?
జ: శ్రీముఖ, సిముఖ
17) తొలి సారిగా శాసనాలు ముద్రించినది ఎవరు?
జ: కృష్ణుడు
18) బౌద్ద బిక్షువులకు దేనిని అంకితం చేశాడు?
జ: నాసిక్ గుహ శాసనం
19) నాసిక్ ప్రాంత అధికారిగా ఎవరిని నియమించాడు?
జ: మహామాత్రను
20) సిముఖుడు కుమారుడు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి
21) మొదటి శాతకర్ణి ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు ?
జ: మరాఠ్ త్రణకెయిరో కుమార్తె దేవి నాగానికను
22) మొదటి శాతకర్ణి బిరుదు ఏంటి?
.జ: సామ్రాజ్యాధిపతి
23) మొదటి శాతకర్ణి ఏయే యాగాలు చేశాడు?
జ: రెండు అశ్వమేధ యాగాలు,రాజసూయ యాగం
24) మొదటి శాతకర్ణికి ఉన్న బిరుదులు ఏంటి ?
జ: సామ్రాట్, దక్షిణాపధపతి
25) గౌతమీ పుత్రశాతకర్ణి కంటే ముందు ఎవరు పరిపాలించారు?
జ: హాలుడు
26) హాలుడి రచనలు ఏవి ?
జ: గాధాసప్తశతి
27) హాలుడికి గల బిరుదులు ఏమిటి?
జ: కవి వత్సలుడు
28) శాతవాహన రాజుల్లో 23వ రాజు ఎవరు?
జ: గౌతమీపుత్రశాతకర్ణి
29) గౌతమీ పుత్ర శాతకర్ణికి గల బిరుదు ఏమిటి?
జ: క్షహరాట వంశ నిరవశేషకం (క్షహరాట వంశవిధ్వంసక)
30) గౌతమీ పుత్రశాతకర్ణికి బిరుదులు ఏమిటి.?
జ: ఏకబ్రహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన. త్రిసముద్రతోయ పీతవాహన, శాత వామనకుల, యశ ప్రతిష్టాపనాకార
31) శాతవాహన రాజుల్లో చివరివాడెవరు ?
జ: యజ్ఞశ్రీ శాతకర్ణి
32) యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరిని ఆదరించాడు ?
జ: ఆచార్య నాగార్జునుడు
33) ఆచార్య నాగార్జునుని గౌరవార్దం ఇతను ఏమి కట్టించాడు?
జ: శ్రీ పర్వతం దగ్గర ఓ మహా చైత్యం
34) ఆచార్య నాగార్జునుడు ఏ మతాన్ని ప్రచారం చేశాడు?
జ: మహాయాన బౌద్ద మతం
35) రాజులు బిరుదులు ధరించే అలవాటు ఎవరి కాలంలో ప్రారంభం అయింది ?
.జ: శాతవాహనుల కాలంలో
36) గ్రామాధికారులను ఏమని పిలిచేవారు?
జ: గ్రామణి
37) శాతవాహనుల కాలంలో పట్టణాలను ఏమని అనేవారు?
జ: నిగమ
38) కులపెద్దలను ఏమని అనేవారు?
జ: గ్రహపతులు
39) శాతవాహనుల కాలంలో గ్రామపెద్దను ఏమంటారు?
జ: గుల్మిక
40) వ్యవసాయంలో నీటిని తోడడానికి ఏమి ఉండేవి?
జ: ఉదకయంత్రాలు
41) కులరికలు ఏమి చేసేవారు?
జ: కుండల తయారీ
42) కొలికలు ఏమి చేసేవారు?
జ: నేతపని
43) శాతవాహనుల స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని గురించి ఎవరు రాసారు?
జ: టాలమీ తన గ్రంధమైన A Guide to Geography
44) శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించిన నాణెం ఏంటి?
జ: కార్షపణ
45) హాలికులు ఎవరు?
జ: వ్యవసాయదారులు, రైతులు
46) శాతవాహనుల కాలంలో గధికులు అని ఎవరిని పిలిచేవారు ?
జ: సుగంధ ద్రవ్యం తయారుచేసేవారు
47) శాతవాహనుల ఆరాధ్యదేవతలు ఎవరు?
జ: ఇంద్రుడు, వరుణుడు, వాసుదేవుడు
48) సాహిత్యంలో ఏ భాషకు ప్రముఖ స్థానం ఉంది?
జ: ప్రాకృతిక భాషకు
49) ఆచార్య నాగార్జునుడు, ఆర్య దేవుడు తమ గ్రంధాలను ఏ భాషలో రాసారు?
జ: సంస్కృతం
50) శాతవాహనుల కాలంలో నిర్మించిన అత్యంత మనోహర స్థూపం ఏది?
జ: నల్గొండ జిల్లాలోని ఫణిగిరి