శాతవాహనులు 3

1) సోమదేవ సూరి రచించిన కధా సరిత్సాగరం ప్రకారం శాతవాహన మూలపురుషుడు ఎవరు?
జ: శాతవాహనుడు
2) శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేర్లతో పిలిచేవారు?
జ: ఆహారము
3) నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ఏది?
జ: భట్టిప్రోలు
4) శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి?
జ: భూమిశిస్తు
5) నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి
6) శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే ఏమిటి?
జ: వృత్తిసంఘాలు
7) సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు ఎవరు?
జ: కుంతల శాతకర్ణి
8) శాతవాహనుల రాజభాషఏది?
జ: ప్రాకృతం
9) శాతవాహనుల కాలంలో నౌకావాణిజ్యాన్ని ప్రోత్సహించినట్టు తెలిపే శాసనం ఏది?
జ: గుంటుపల్లి
10) శాతవాహనుల శాసనాలన్నీ ఏ బాషలో, ఏ లిపిలో ఉన్నాయి?
జ: ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో
11) క్రీ.శ.78లో శాతవాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
12) శాతవాహనుల కాలంలో ప్రసిద్ది చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు?
జ: జైనమతం
13) శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు ఎవరు?
జ: స్ధారవాహులు
14) ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించినది?
జ: మొదటి కృష్ణుడు
15) నాసిక్ కన్హేరి గుహలను బౌద్ద మతస్ధులకు దానం చేసిన రాజు?
జ: కృష్ణుడు
16) శాతవాహనుల కాలంలో వృత్తి పన్నును ఏమంటారు ?
జ: కారుకర
17) ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంధాలు ఏమిటి?
జ: ఆరోగ్య మంజరి, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారిక
18) బెణకటక స్వామి అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
19) బౌద్ధ మతస్ధుల కోసం నాగానిక తొలిపించిన గుహాలు ఏవి?
జ: నానాఘాట్
20) కార్లే గుహాలను మహా సాంఘిక బౌద్దశాఖకు దానం చేసిన రాజు ఎవరు?
జ: రెండో పులోమావి
21) శాతవాహనుల కాలంలో వడ్డీరేటు ఎంత?
జ: 12శాతం
22) అజంతా గుహల్లోని 9,10 గుహాలు ఏ యుగానికి చెందినవి?
జ: శాతవాహనులు
23) ప్రముఖ బౌద్ధక్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం ఏది?
జ: ఘంటసాల
24) గాధాసప్తశతిని పోలిన గ్రంధం వజ్జలగ్గను రచించింది ఎవరు?
జ: జయవల్లభ
25) శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు?
జ: ఇటుకలు
26) శాతవాహనుల కాలంలో రాతితో తొలిచిన చైత్యం ఎక్కడ ఉన్నది?
జ: గుంటుపల్లి
27) శ్రీపర్వతం దగ్గర శైల మండపాలు నిర్మించిన రాజు ఎవరు?
జ: యజ్ఞశ్రీ శాతకర్ణి
28) శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి?
జ: కొండాపూర్
29) బృహత్కధను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు?
జ: పైశాచీ భాష
30) శాతవాహన కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు(వెండి)?
జ: 1 : 35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు)
31) శాతవాహనులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పాలించారు?
జ: క్రీ.పూ.230 నుంచి క్రీ.శ.223 వరకు
32) ప్రాచీన నాణేలు ఎక్కడ లభించాయి?
జ: మస్కీ, గాజులబండ, కొండాపూర్, వరంగల్ దగ్గర్లో సాద్వహన అనే ప్రాచీన నాణేలు లభించాయి
33) శాతవాహన వంశ మూలపురుషుడు ఎవరు?
జ: సాద్వహనుడు
34) శ్రీముఖుడు ఎవరి సామంతరాజు?
జ: మౌర్యచక్రవర్తి అశోకుడి సామంతరాజు
35) శ్రీముఖుడు మొదట ఎక్కడ పరిపాలించాడు?
జ: కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతాన్ని
36) శాతవాహనులలో గొప్పవాడు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి
37) మొదటి శాతకర్ణి కుమారుడు ఎవరు ?
జ: పూర్ణోత్సంగుడు
38) ఎవరి దండయాత్ర వలన శాతవాహన రాజ్యానికి ఆర్ధికంగా నష్టం వాటిల్లింది?
జ: భారవేలుడి
39) రెండో శాతకర్ణి రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాు?
జ: 56 సంవత్సరాలు
40) రెండో శాతకర్ణి బిరుదు ఏమిటి?
జ: రాజన్యశ్రీ శాతకర్ణి
41) కుంతల శాతకర్ణి ఆస్తానంలో ఉన్న కవులెవరు?
జ: గుణాఢ్యుడు, శర్వ వర్మ
42) పంచతంత్రాన్ని ఎవరు రాసారు?
జ: గుణాఢ్యుడి బృహత్కధ ఆధారంగా విష్ణుశర్మ
43) మగధను ఎవరు ఆక్రమించారు?
జ: మొదటి పులోమావి
44) హాలుడికి గల బిరుదు ఏమిటి?
జ: కవివత్సలుడు
45) హాలుడు రచించిన గ్రంధం ఏమిటి?
జ: గాధాసప్తశతి
46) హలుడి కీర్తి ప్రతిష్టలను ఏవి తెలుపుతాయి?
జ: అభిదాన చింతామణి, లీలావతి కావ్యం, దేశీనామ మాలాది గ్రంధాలు
47) గౌతమీపుత్రశాతకర్ణి తల్లి ఎవరు?
జ: బాలశ్రీ
48) నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు
జ: గౌతమీపుత్రశాతకర్ణి తల్లి బాలశ్రీ
49) గౌతమీపుత్రశాతకర్ణి ఎవరిని ఓడించాడు?
జ: క్షహరాట వంశీయుడైన నహపాణుడిని
50) ఇతడి రధశ్వాలు ఎన్ని సముద్రాల నీళ్లు తాగేవని ప్రతీతి?
జ: మూడు సముద్రాల
51) గౌతమీ పుత్ర ఏ స్తూపానికి తోరణాలను చెక్కించాడు.
జ: సాంచీ స్థూపానికి
52) రెండో పులోమావి బిరుదు ఏమిటి?
జ: దక్షిణా పధేశ్వరుడు, నవనగర స్వామి
53) రెండో పులోమావి ఎవరికి సమకాలికుడు?
జ: హిప్పా కురన్ పాలకుడైన కర్ధముక చష్టనుడు
54) శాతవాహనరాజుల్లో చివరివాడెవడు?
జ: యజ్ఞశ్రీ శాతకర్ణి
55) యజ్ఞశ్రీ శాసనాలు ఎక్కడ లభించాయి?
జ) నాసిక్, కన్హేరి, చిన గంజాం
56) మత్స్యపురాణాన్ని ఎవరి కాలంలో రచించారు?
జ: యజ్నశ్రీశాతకర్ణి
57) ఆచార్య నాగార్జునుడు యజ్నశ్రీ కోసం ఏమి రచించాడు?
జ: సుహ్రలేఖను