హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్ సంస్కరణలు

 

1) హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు?
జ) మీర్ ఖమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ @ నిజాముల్ ముల్క్ (1724)
2) చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి ?
జ: కుర్ర కత్తి వీరుడు
3) నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత?
జ) విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు
4) నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది ?
జ: ఔరంగాబాద్. 1770 తర్వాత హైదరాబాద్ కి మార్చాడు
5) నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సుభాలు ఉండేవి ?
జ: 6 సుభాలు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్ (వీటినే స్మిత్ లు అని కూడా అంటారు )
6) రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించిన విధానం ?
జ) జాగీర్దారీ పద్దతి
7) జాగీర్ అనే పదానికి అర్థమేంటి ? వీటిని ఎవరికి ఇచ్చేవారు ?
జ: జాగీర్ అంటే పర్షియన్ భాషలో ‘ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం’. దీన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసే వారికి ఇచ్చేవారు.
8) జాగీర్దారీ విధానం మొగలులు నుంచి వచ్చింది. అయితే మొదటి జాగీర్ ఇచ్చిన మొగల్ రాజు ఎవరు ? ఎవరికి ఇచ్చాడు ?
జ: 1561లో అక్బర్... రాందాస్ కు ఇచ్చాడు.
9) అసఫ్ జాహీల కాలంలో మొదటి జాగీర్ ఎవరు ఎవరికి ఇచ్చారు ?
జ: నిజాముల్ ముల్క్ ఓ అధికారికి ఇచ్చాడు.
10) పైగా జాగీర్లు అంటే ఏంటి ? ఎవరికి ఇచ్చేవారు ?
జ: సైనిక జాగీర్లు. నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించే వారికి ఇచ్చేవారు. మొదటి జాగీర్ అబ్దుల్ భైర్ ఖానీ్ షమ్స్ ఉల్ ఉమ్రా-1కి ఇచ్చారు.
11) సర్ఫేఖాస్ భూములంటే ఏంటి ? ఎంత విస్తీర్ణంలో ఉండేవి ?
జ: నిజాం సొంత జాగీర్లు. ఇవి హైదరాబాద్ చుట్టు పక్కల (అత్రాఫ్ బల్దా) ప్రాంతాలు. 7,133 చ.మైళ్ళు ఉండేవి.
12) ఖల్సా లేదా దివానీ భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయి ?
జ: ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రధాని వీటిని నియంత్రిస్తాడు.
13) హైదరాబాద్ సంస్థానం బ్రిటీష్ వారికి ఎంత బాకీ పడింది ? ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించింది ఎవరు ?
జ: 1851 నాటికి 75 లక్షల రూపాయలు. డల్హౌసీ ఆదేశించాడు.
14) బీరార్ ఒప్పందం ఎందుకు కుదిరింది ?
జ: హైదరాబాద్ సంస్థానం చెల్లించాల్సిన బకాయి 8.73 లక్షల కోసం బీరార్ లో మూడు ప్రాంతాలను బ్రిటీష్ వారికి అప్పగించారు. ఇదే బీరార్ ఒప్పందం.
15) బీరార్ ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది ?
జ: నవాబ్ నసీరుద్దౌలా - డల్హౌసీ (బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ అప్పగించారు )

16) బల్దియా అంటే అర్థమేంటి ?
జ: రాజధాని పట్టణం (హైదరాబాద్)
17) బల్దియా పోలీసు, పురపాలక కమిషనర్ ను ఏమంటారు ?
జ) కొత్వాలీ అరున్ ఎ బల్దా

18) ఒకటో సాలర్ జంగ్ అసలు పేరు ఏంటి? ఎప్పుడు ప్రధాని అయ్యాడు ?
జ: మీర్ తురాబ్ అలీ ఖాన్ (1853లో)
19) హైదరాబాద్ లో పరిపాలనా బోర్డును స్థాపించింది ఎవరు ?
జ: మజ్లిస్-ఇంతియాజమ్-ఎ-మాల్ గుజారీ (పరిపాలనా బోర్డు)ను సాలరాజంగ్ -1 స్థాపించాడు.
20) హైదరాబాద్ సంస్థానంలో దివానీ ప్రాంతాన్ని రెవెన్యూ, న్యాయ పరిపాలన కోసం సాలార్ జంగ్ జిల్లాలుగా విభజించారు ? వీటినేమంటారు?
జ: జిలాబందీ
21) సాలర్ జంగ్ హయాంలో రాజ్యంలో ఎన్ని పరిపాలనా వ్యవస్థలు ఉండేవి ?
జ: 14 శాఖలు (వీటి పాలనంతా దివాన్ లేదా రిజెంట్ (ప్రధాని) చేతులమీదుగా జరిగేది)
22) ప్రధాని లేదా దివాన్ కింద పనిచేసే మంత్రులను ఏమని పిలిచేవారు ?
జ: సదర్ ఉల్ మిహం
23) ముఫసిల్ ఏరియాల్లో న్యాయసమస్యల పరిష్కారానికి, రోహిల్లాలను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన దళం పేరేంటి ?
జ: నిజామత్ దళం లేదా జామియత్ జిలాదారీ
24) నిజాం కాలంలో రెవెన్యూ పాలనను నిర్వహించే రెవెన్యూ మంత్రిని ఏమనేవారు ?
జ: సదర్ -ఉల్-మిహం-ఎ-మాల్ గుజరీ
25) గ్రామాల్లో ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే వారు ఎవరు ?
జ: ఇద్దరు పటేళ్ళు (ఒకరు రెవెన్యూ, మరొకరు పోలీస్ విధులు)
గ్రామపట్వారీ - జమా ఖర్చులు రాసేవాడు, తలారీ - గ్రామ సేవకుడు, సేతు సింధి (50 ఇండ్ల కాపలాదారుడు)
26) గ్రామంలో నీటి అవసరాలను పర్యవేక్షించే సేవకుడిని ఏమంటారు ?
జ: నీరి
27) ప్రతి ఏడాది పంటలకు శిస్తులు నిర్ణయించే పద్దతిని ఏమంటారు ?
జ: జమా బందీ
28) తాలూకా (తహసీల్) వ్యవస్థకు అధిపతిగా ఎవరు ఉండేవారు ?
జ: తహసీల్ దారు (రెవెన్యూ వసూళ్ళలో కీలక వ్యక్తి)
29) మొదటి సాలార్ జంగ్ హాలిసిక్కా అనే వెండి నాణేన్ని ఏ నవాబు కాలంలో ప్రవేశపెట్టాడు ?
జ: అఫ్జల్ ఉద్దౌలా
30) 19వ శతాబ్దంలో ఏ పథకానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు ?
జ: చందా రైల్వే పథకం (1883లో)
31)ఎవరు ప్రధాని అయ్యాక భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు?
జ) సాలార్ జంగ్-1