Thursday, October 1

RRB NTPC, GROUP D ఎగ్జామ్స్ ఎప్పుడు ? సవాల్ గా మారిన ఫిజికల్ డిస్టెన్స్ రూల్ !

RRB NTPC, RRB Group D పరీక్షల నిర్వహణకు ఫిజికల్ డిస్టెన్స్ ( సోషల్ డిస్టెన్స్ ) నిబంధన అడ్డంకిగా మారింది. 2019 లో జారీ చేసిన నోటిఫికేషన్లకి పరీక్షలను నిర్వహించేందుకు బయటి ఏజెన్సీలకు టెండర్లను పిలిచింది RRB. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహణకు 2019 సెప్టెంబర్ లోనే నిర్వహణా ఏజెన్సీలు అప్లయ్ చేసుకోడానికి పిలుపు ఇచ్చింది. అయితే కోవిడ్ 19 ఎఫెక్ట్ తర్వాత ఈ ప్రాసెస్ ను నిలిపేసింది RRB. ప్రస్తుతం మరోసారి కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏజెన్సీలను ఆహ్వానించింది. అందుకోసం 2020 జూన్ 29 వరకూ గడువు విధించింది.

ఇందులో భాగంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో తప్పనిసరిగా కోవిడ్ 19 రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయడం, సెంటర్లను శానిటైజ్ చేయడం, బయో మెట్రిక్ /చేతులతో చెక్ చేసే నిబంధనలు తొలగించేలా చూడాలి. అందుకోసం ఎగ్జామ్స్ నిర్వహించే ఏజెన్సీకి టెక్నికల్, ఆపరేషనల్, లాజిస్టిక్, మ్యాన్ పవర్ సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. 1.2 కోట్ల మందికి పైగా అప్లయ్ చేసిన ఎగ్జామ్ కావడం, దశల వారీగా వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎగ్జామ్ జరుగుతున్న తీరును రైల్వే అధికారులు పర్యవేక్షించేందుకు... రైల్వే బోర్డుతో పాటు 21 RRB ఆఫీసుల్లోనూ కంట్రోల్ రూమ్స్, డాష్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎగ్జామ్ నిర్వహణా సంస్థలదే.

ఇవన్నీ నిర్వహించే సామర్థ్యం ఉన్న ఏజెన్సీలకే RRB ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బాధ్యతను అప్పగించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈనెల 29వరకూ కండక్టింగ్ ఏజెన్సీల నుంచి బిడ్డింగ్స్ స్వీకరించాక.. వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలన చేసిన తర్వాతే ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు అనేది తేలనుంది.