Thursday, October 1

RRB NTPC ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్, ట్విట్టర్ లో ఆందోళనకి దిగొచ్చిన RRB

ట్విట్టర్ వేదికగా నిరుద్యోగులు చేపట్టిన #5Baje5Minutes ఉద్యమానికి రైల్వే శాఖ అధికారులు దిగొచ్చారు. RRB NTPC, Group D కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని 2020 డిసెంబర్ 15నుంచి నిర్వహిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. మూడు కేటగిరీలకు సంబంధించిన రిక్రూట్ మెంట్ అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే  ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తొందర్లోనే  ప్రకటిస్తామన్నారు.

సోషల్ మీడియాలో 7 లక్షల మంది యుద్ధం

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ 2019 లో ప్రకటించిన NTPC, గ్రూప్ డి తదితర నోటిఫికేషన్లకి కోటిన్నర మందికి పైగా అప్లయ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఎగ్జామ్స్ నిర్వహణకి సంబంధించిన సమాచారాన్ని RRB ప్రకటించలేదు. దాంతో టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ట్విట్టర్ వేదికగా #5Baje5Minutes పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు నిరుద్యోగులు. రైల్వేలతో పాటు SSC పోస్టుల భర్తీ కోరుతూ శనివారం సాయంత్రం 5.45 గంటల వరకూ దాదాపు 7 లక్షలమందికి పైగా ఈ హాష్ ట్యాగ్ కు ట్వీట్ చేశారు.

అంతకుముందు #SpeckUpForSSCRailwaysStudents పేరుతో మొదట ఉద్యమం చేశారు నిరుద్యోగులు. దాంతో సెప్టెంబర్ 1 నాడు SSC వివిధ పరీక్షలకు సంబంధించిన డేట్స్ రిలీజ్ చేసింది.. RRB మాత్రం స్పందించ లేదు. దాంతో సెప్టెంబర్ 5 టార్గెట్ గా మళ్ళీ నిరుద్యోగులు ఉద్యమించడంతో ఎట్టకేలకు రైల్వే అధికారులు దిగొచ్చారు. అభ్యర్థులు ఈ హాష్ ట్యాగ్ ను RRB తో పాటు రైల్వే మంత్రి, ప్రధానమంత్రి ఆఫీసులకు కూడా ట్యాగ్ చేశారు.