Monday, October 15
Log In

60వేల రైల్వే ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 26,502 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇప్పుడీ సంఖ్య 60 వేలకు చేరింది. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఉద్యోగాల్లో భాగంగా మొదటి విడత ఈ నెల 9న జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం దేశమంతటా 47.56 లక్షల మంది అప్లయ్ చేశారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెంచడంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ఎగ్జామ్ రాసుకునే ఛాన్సుంది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన వేసిన తర్వాత వివిధ రైల్వే జోన్లలో వచ్చిన ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు.

ఈనెల 9న జరిగే ఎగ్జామ్ కోసం జులై 26నే ఆన్ లైన్ లింక్ అందుబాటులోకి వచ్చింది. పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి పరీక్షలు రాసేందుకు జనరల్ అభ్యర్థులకు గంట టైమ్ ఉంటుంది. దివ్యాంగులకు మరో 20 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు. అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ అథారిటీ కూడా తీసుకోవాలి.

==================

RRB ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.  మా దగ్గర RRB ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించిన వారికి మరో సదవకాశం ఇస్తున్నాం.  మీకు ప్రస్తుతం ఇస్తున్న 10 గ్రాండ్ టెస్టులతో పాటు, మ్యాథ్స్ టెస్టులను అదనంగా మీకు అందుబాటులోకి తెస్తున్నాం.  ఉద్యోగాల సంఖ్య పెరిగినందున మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోడానికి వీలుగా ఈ సౌకర్యం కల్పిస్తున్నాం.  ఇప్పుడు ఫీజులు చెల్లించినవారికి కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఎగ్జామ్ దగ్గర్లో ఉన్నందున ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిదని గుర్తుంచుకోండి. గ్రాండ్ టెస్టులకు టైమ్ లిమిట్ కూడా తీసేశాం.  మీరు ఎన్ని సార్లయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు.

RRB గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించేవారు ఈ కింది లింక్ ద్వారా సమాచారం తెలుసుకోగలరు.

RRB (గ్రూప్ C &D) గ్రాండ్ టెస్టులు