Thursday, March 21

పోలీస్ ఉద్యోగార్ధులకు తీపి కబురు. హైదరాబాద్ లో రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీ ప్రారంభం.

 

అంకితభావం.. క్రమశిక్షణ.. చిత్తశుద్ధే పెట్టుబడిగా.. స్థాపించిన అతి కొద్ది కాలంలోనే వందలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రైట్ ఛాయిస్ సంస్థ ఆధ్వర్యంలో దిల్ షుక్ నగర్ లో పోలీస్ అకాడమీ ప్రారంభమైంది.  మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ కు అర్ధమెటిక్ షార్ట్ కట్స్ స్పెషలిస్ట్.. 30 సంవత్సరాల అనుభవం ఉన్న చిట్టినాయుడు సార్ (ఆర్. సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ సీనియర్ ఫ్యాకల్టీ ) సారధ్యం వహిస్తున్నారు.

కలల ఉద్యోగానికి సరైన వేదిక రైట్ ఛాయిస్ :

పోలీస్ ఉద్యోగం సాధించడం.. చాలా మంది యువతీ, యువకుల జీవితాశయం. అలాంటి కలలను సాధించడానికి సరైన వేదిక రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీగా చెప్పవచ్చు. మొదట ఖమ్మంలో ప్రారంభించిన రైట్ ఛాయిస్ అకాడమీ.. స్థాపించిన కొద్ది కాలంలోనే సుమారు 700లకు పైగా గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. కోచింగ్ సెంటర్ల చరిత్రలోనే.. అతి తక్కువ కాలంలో ఇన్ని ఉద్యోగాలు సాధించడం కేవలం రైట్ ఛాయిస్ కి మాత్రమే చెల్లింది. గత కొద్ది కాలంగా వివిధ జిల్లాల విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని…. మార్చి 2న హైదరాబాద్ లో కూడా పోలీస్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు.. చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ప్రకటించారు.

డైలీ టెస్టుల నిర్వహణకు రాష్ట్రంలోనే నెంబర్ వన్.:

పోటీ పరీక్షల విషయంలో అత్యంత కీలకమైన మాక్ టెస్టులు, డైలీ టెస్టులు, వీక్ టెస్ట్ ల నిర్వహణలో.. రైట్ ఛాయిస్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ కోచింగ్ సెంటర్ గా చెప్పవచ్చు. మారుతున్న పోటీ పరీక్షల సరళికి అనుగుణంగా.. ఓఎంఆర్ విధానంలో.. అత్యంత కఠినమైన మాక్ టెస్టులు నిర్వహిస్తూ.. వారి మార్కులను ఎప్పటికప్పుడు ప్రకటించడం.. రైట్ ఛాయిస్ కి మాత్రమే చెల్లింది. పోటీ పరీక్షల నిపుణులతో.. అతిముఖ్యమైన ప్రశ్నలను రూపొందించి.. మాక్ టెస్టులు నిర్వహించడంతో.. ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు.. రైట్ ఛాయిస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీంతోపాటే.. వాట్సప్ ద్వారా రోజూ 20వేల మందికి పైగా విద్యార్థులకు కరెంట్ ఎఫైర్స్ పంపుతున్నారు. ( 8985093399 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో మెసేజ్ చేస్తే.. రోజూ కరెంట్ ఎఫైర్స్ పంపడం జరుగుతుంది)

రీజనింగ్ అండ్ అర్థమెటిక్ విభాగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్.సి రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్, హైదరాబాద్ ఫ్యాకల్టీ చిట్టినాయుడు సార్ ఆధ్వర్యంలో ఎస్.ఐ, కానిస్టేబుల్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు క్లాసులు, మాక్ టెస్టులు, ప్రశ్నపత్రంపై విశ్లేషణలతో.. ఎక్కువ ఉద్యోగాలు సాధించడమే ధ్యేయంగా  మెయిన్స్ పరీక్ష వరకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నారు.

ఇనిస్టిట్యూట్ అడ్రస్.

రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీ ( బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన), కమల హాస్పటల్ ఎదురుగా, దిల్ షుక్ నగర్. ఫోన్: 8985093399.