టెన్త్ అర్హతతో RBI లో ఉద్యోగం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 17 రీజినల్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దేశ స్థాయిలో ఆన్ లైన్ ఎగ్జామ్ తో పాటు రీజినల్ ఆఫీస్ పరిధిలో స్థానిక భాషలో సామర్థ్యాన్ని పరిశీలించే టెస్టును నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైతే రూ.10,940 బేసిక్ పే ఉంటుంది. మిగతా అలవెన్సులతో కలపి రూ.26,508 వరకూ వస్తాయి.
మొత్తం ఖాళీలు : 841
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు కలిపి : హైదరాబాద్ రీజినల్ ఆఫీసు పరిధిలో 57 పోస్టులు ఖాళీ
OC-24
EWS-5
OBC -15
SC-8
ST-5
అర్హత : పదో తరగతిని 2021 ఫిబ్రవరి 1 నాటికి పూర్తి చేసి ఉండాలి
(గ్రాడ్యుయేట్లు, ఇతర ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు అప్లయ్ చేయడానికి అనర్హులు )
వయస్సు: 2021 ఫిబ్రవరి 1 నాటికి 18 నుంచి 25 యేళ్ళ మధ్య ఉండాలి
( SC/ST లకు పదేళ్ళు, OBC లకు 3యేళ్ళు, PWD లకు 10యేళ్ళ వయో సడలింపు ఉంటుంది)
ఎలా ఎంపిక చేస్తారు ?
1) కంట్రీ లెవల్ ఆన్ లైన్ టెస్ట్
2) లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్
ఆన్ లైన్ టెస్ట్:
రీజనింగ్ : 30 ప్రశ్నలు - 30 మార్కులు
జనరల్ ఇంగ్లీష్ : 30 ప్రశ్నలు - 30 మార్కులు
జనరల్ అవేర్ నెస్ : 30 ప్రశ్నలు - 30 మార్కులు
న్యూమరికల్ ఎబిలిటీ : 30 ప్రశ్నలు - 30 మార్కులు
మొత్తం 120 ప్రశ్నలు - 120 మార్కులు
దరఖాస్తులను ఆన్ లైన్ లో ప్రారంభం : 24 ఫిబ్రవరి 2021
చివరి తేది : 15 మార్చి 2021
ఆన్ లైన్ ఎగ్జామ్ తేది: 2021 ఏప్రిల్ 9, 10
అప్లికేషన్ ఫీజు : OBC/EWS/జనరల్ అభ్యర్థులకు : రూ.450
SC/ST/PWD అభ్యర్థులకు రూ.50
వెబ్ సైట్ : http://www.rbi.org.in