Sunday, August 25

PSLV – C42 రాకెట్ ప్రయోగం సక్సెస్

- 2018 సెప్టెంబర్ 16న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV C42 ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
- భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాSAR, S1-4 లను 230.4 టన్నుల బరువున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - సీ42 వాహనక నౌక మోసుకెళ్ళింది
- శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక ద్వారా దీన్ని నింగిలోకి పంపారు. దీని వ్యయం రూ.175 కోట్లు
- ఇప్పటిదాకా ఇస్రో 23 దేశాలకు చెందిన 242 విదేశీ ఉపగ్రహాలను షార్ నుంచి PSLV రాకెట్ల ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
- ఈ ప్రయోగంతో మొత్తం 243 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
- విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఇస్రో ఏడాదికి రూ.220 కోట్లు ఆర్జిస్తోంది.
- వచ్చే ఆరు నెలల్లో మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ వెల్లడించారు.