Thursday, October 1

రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు : 131 పోస్టులు మంజూరు, త్వరలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ తో కొత్త పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 14 స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిల్లో వివిధ కేటగిరీలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం రిక్రూటింగ్ ఏజెన్సీకి (TSPSCకి) ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

భర్తీ చేసే పోస్టులు - వాటి సంఖ్య

1) అడిషినల్ కమిషనర్ - 01

2) జూనియర్ కమిషనర్ - 02

3) డిప్యూటీ కమిషనర్స్ : 03

4) అసిస్టెంట్ కమిషనర్స్ : 04

5) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్: 12

6) అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్: 09

7) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్స్: 18

8) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్సెపెక్టర్స్:: 02

9) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ : 14

10) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ : 19

11) స్టాఫ్ ఆఫీసర్స్: 05

12) ఆఫీస్ సూపరింటెండెంట్స్: 25

13) సీనియర్ అసిస్టెంట్స్ : 18

మొత్తం పోస్టులు: 131

పోస్టులు భర్తీ అయ్యే కొత్త ఎక్సైజ్ స్టేషన్లు

1) అమీర్ పేట్ II ( హైదరాబాద్)

2) సికింద్రాబాద్ II, ముషీరాబాద్ II (సికింద్రాబాద్)

3) శంషాబాద్ -II, శేరి లింగంపల్లి - II (శంషాబాద్)

4) సరూర్ నగర్ II, హయత్ నగర్ II (సరూర్ నగర్)

5) కుత్బుల్లాపూర్ II, బాలానగర్ II (మేడ్చల్)

6) ఘట్కేసర్ II, ఉప్పల్ II (మల్కాజ్ గిరి)

7) హన్మకొండ II (వరంగల్ అర్భన్)

మొత్తం 131 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, హైదరాబాద్ ఈ పోస్టులను నోటిఫై చేయడంతో పాటు... Distribution Statement ను రిక్రూటింగ్ ఏజెన్సీ ( TSPSC )కి, ఆర్థికశాఖకు పంపాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.  అప్పటి వరకూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.

 TS EXAMS  జిల్లా వాట్సాప్ లేదా Telegram గ్రూపుల్లో చూడండి. ఎవరైనా జాయిన్ కాని వారు ఉంటే... 703 6813 703 కి మీరు ఏ జిల్లాకి (పాత జిల్లాలు) చెందిన వారో వాట్సాప్ కి మెస్సేజ్ పెట్టండి... ఆ జిల్లా లింక్ పంపుతాను. 

GO వివరాలు