Saturday, August 18
Log In

ఒకటే గురి … రెండు పోస్టులు !

అవును... లక్ష్యం ఒకటే... జాబ్ కొట్టాలి... ఎదురుగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏదో ఒక కొలువు సంపాదించాలి..... ఏంటా ఉద్యోగాలు ?
1) వీఆర్వోలు
2) గ్రూప్ - 4

సిలబస్ మాటేంటి ?
గ్రూప్ - 4 :
జనరల్ నాలెడ్జ్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు
సెక్రటేరియల్ ఎబిలిటీస్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు
అంటే ఒక్కో పేపర్ లో 150 నిమిషాలు, 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి.

వీఆర్వో :
జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరియేట్ ఎబిలిటీస్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు

ముందుగా గ్రూప్ - 4 సిలబస్ చూద్దాం:
జీకేలో:
1) కరెంట్ ఎఫైర్స్
2) అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3) నిత్య జీవితంలో జనరల్ సైన్స్
4) పర్యావరణ సమస్యలు, విపత్తులు నిర్వహణ
5) తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ
6) భారత రాజ్యాంగం
7)భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8) ఆధునిక భారత దేశ చరిత్ర
9) తెలంగాణ చరిత్ర, ఉద్యమం
10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
11) తెలంగాణ రాష్ట్ర విధానాలు

సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో...
1) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
2) లాజికల్ రీజనింగ్
3) కాంప్రెహెన్షన్
4) రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్
5) న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్

ఇక వీఆర్వోలో కూడా జీకేలో 11 అంశాలతో పాటు ఎథిక్స్, బలహీన వర్గాలు, లింగ అసమానతలు, సామాజిక స్పృహ అంశాలను చేర్చారు.

సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో...
1) బేసిక్ ఇంగ్లీష్ (8వ తరగతి స్థాయి)
2) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
3) లాజికల్ రీజనింగ్
4) న్యూమరికల్ ఎబిలిటీస్
5) అర్థమెటికల్ ఎబిలిటీస్

గ్రూప్ - 4, వీఆర్వో... ఈ రెండింటికీ కామన్ గా ఉండే అంశాలపై ముందుగా దృష్టిపెట్టాలి. ఏ టాపిక్ ఎలా చదవాలన్నది మరో ఆర్టికల్ లో వివరిస్తాను.
- మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్

Comments are closed.