PRACTICE TEST – 05 ( INDIAN HISTORY)

1) దేశంలో చరిత్ర పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించింది ఎవరు ?
ఎ) రాబర్ట్ బ్రూస్ ఫుట్ బి) మెకంజీ సి) డి.డి.కోశాంబి డి) సర్ జాన్ మార్షల్
2) భారత పురావస్తు శాస్త్ర పితామహుడు అని ఎవర్ని అంటారు ?
ఎ) సర్ జాన్ మార్షల్ బి) రాబర్ట్ బ్రూస్ ఫుట్ సి) కన్నింగ్ హోం డి) మెకంజీ
3) శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
ఎ) ఎపిగ్రఫీ బి) న్యూమిస్ మ్యాటిక్స్ సి) పాలియోగ్రఫీ డి) డెండ్రో క్రోనాలజీ
4) పురాతన రాతప్రతులను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ?
ఎ) ఎపిగ్రఫీ బి) న్యూమిస్ మ్యాటిక్స్ సి) పాలియోగ్రఫీ డి) డెండ్రో క్రోనాలజీ
5) భారత్ లో మొదటిగా శాసనాలు వేయించింది ఎవరు ?
ఎ) కనిష్కుడు బి) చంద్రగుప్త మౌర్యుడు సి) హర్షవర్ధనుడు డి)అశోకుడు
6) ప్రపంచంలోనే మొదట పత్తిని పండించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి ?
ఎ) లంగరాజ్ (గుజరాత్) బి) బాగోధ్ (రాజస్థాన్ ) సి) నెవాసా( మహారాష్ట్ర) డి) అదంగఢ్ (మధ్యప్రదేశ్)
7) బూడిద కుప్పలు, 13 రకాల మట్టి పాత్రలను ఎక్కడ కనుగొన్నారు ?
ఎ) పోచంపాడు బి) ఉట్నూరు సి) కోటిలింగాల డి) అమ్రాబాద్
8) తెలంగాణలో బృహత్ శిలాయుగం సమాధులు ఏ జిల్లాలో బయటపడ్డాయి ?
ఎ)మహబూబ్ నగర్ బి) నిజామాబాద్ సి) ఖమ్మం డి) నల్గొండ
9) రాతి శవపేటికను గోయిలో పెట్టకుండా భూమ్మీద పెట్టి, దాని చుట్టూ రాళ్ళు పేర్చే సమాధిని ఏమంటారు?
ఎ) మెన్ హిర్ బి) డాల్మన్ సమాధి సి) చిస్ట్ డి) సెర్కోఫాగస్
10) రాష్ట్రంలో రాతి పూసల తయారీ కేంద్రం ఎక్కడ బయటపడింది ?
ఎ) ఉట్నూరు బి) పోచంపాడు సి) ఖమ్మం మెట్టు డి) కోటి లింగాల
11) రాష్ట్రంలో గుర్రం అస్థిపంజరాలు బయటపడ్డ ప్రదేశం ఏది ?
ఎ) పోచంపాడు బి) మహబూబ్ నగర్ సి) కొండగట్టు డి) అమ్రాబాద్
12) వరిని పండించడం ఎప్పటి నుంచి మొదలైంది ?
ఎ) పాతరాతి యుగం బి) బృహత్ శిలా యుగం సి) తొలి పాతరాతి యుగం డి) సూక్ష్మ రాతి యుగం
13) శాతవాహనుల కంటే ముందు కాలానికి చెందినవిగా గుర్తించిన నాణేలు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ?
ఎ) ఏలేశ్వరం బి) దొండపాడు సి) కోటి లింగాల డి) పొలమూరు
14) తెలుగులో రాయించిన మొదటి శాసనాలను ఏ రాజులు రాయించారు ?
ఎ) రేనాటి చోళులు బి) కాకతీయులు సి) శాతవాహనులు డి) ఇక్ష్వాకులు
15) రాష్ట్రంలో ముదిగొండ చాళిక్యుల పరిపాలన వివరించే శాసనం ఏది ?
ఎ) శనిగరం శాసనం బి) పోలవరం శాసనం సి) కొరవి శాసనం డి) చండుపట్ల శాసనం