Practice test 01 (తెలంగాణ చరిత్ర)- హైదరాబాద్ సంస్థానం

1) 1724 అక్టోబర్ 11న మీర్ ఖమ్రుద్దీన్ చిన్‌కిలిచ్ ఖాన్‌ హైదరాబాద్ అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన మొదటి రాజధాని ఏది ?
ఎ) హైదరాబాద్ బి) ఔరంగా బాద్ సి) దౌలతా బాద్ (డి) బీదర్
2) మీర్ ఖమ్రుద్దీన్ చిన్‌కిలిచ్ ఖాన్‌ కి మరో పేరు ఏంటి ?
ఎ) నిజాముల్ ముల్క్ బి) నిజాం అలీ సి) నసీరుద్దౌలా డి) అసఫ్ జాహి
3) 1853లో నసీరుద్దౌలా బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటీష్ వారికి ఇచ్చాడు. ఈ ఒప్పందాన్ని ఏమంటారు ?
ఎ) రాయచూర్ ఒప్పందం బి) ఉస్మానాబాద్ ఒప్పందం సి) బీరార్ డి) నసీరుద్దౌలా అగ్రిమెంట్
4) రెవెన్యూ వసూళ్ళకి సంబంధించి అసఫ్ జాహీలు మొదటగా అవలంభించిన విధానం ఏది ?
ఎ) జాత్ జాగీరు (బి) అల్ తాంఘు సి) జాగీర్దారీ డి) సర్ఫేఖాస్
5) ‘అధీనంలో ఉంచుకున్న ప్రాంతం’ అనే పదానికి పర్షియన్ భాషలో సమానార్థకం ఏది ?
ఎ) జాగీర్ బి) ఇనాం సి) పైగా డి) మహలత్
6) జాగీర్ పద్ధతిని దేశంలో మొదటగా అలవాటు చేసింది మొగలులు. అయితే 1561లో మొగల్ చక్రవర్తి అక్బర్ మొదట ఏ వ్యక్తికి జాగీర్ ను ఇచ్చాడు ?
ఎ) నిజాంముల్ ముల్క్ బి) బీంరావు సి) కాళిదాసు డి) రాందాసు
7) నగదు రూపంలో ప్రభుత్వానికి శిస్తు చెల్లించే అంగీకారంతో పాలకులు కేటాయించిన జాగీరును ఏమంటారు ?
ఎ) జాత్ జాగీరు (బి) అల్ తాంఘు సి) జాగీర్దారీ డి) సర్ఫేఖాస్
8) నిజాం పాలకుల వ్యక్తిగత సైన్యాన్ని పోషించిన వారికి ఇచ్చే జాగీర్లను ఏమంటారు ?
ఎ) పైగా జాగీరు (బి) అల్ తాంఘు సి) జాగీర్దారీ డి) సర్ఫేఖాస్
9) చిన్‌కిలిచ్ ఖాన్‌ (నిజాంముల్ ముల్క్) అంటే అర్థం ఏంటి ?
ఎ) గొప్ప వీరుడు బి) కుర్ర కత్తి వీరుడు సి) రక్త పిపాసి డి) కండల వీరుడు
10) బీరార్ ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది ?
ఎ) నిజాం ముల్ ముల్క్ - డల్హౌసీ బి) నిజాం అలీఖాన్ - బెంటింక్ సి) సాలార్జంగ్ - డల్హౌసీ డి) నవాబ్ నసీరుద్దౌలా - డల్హౌసీ
11) సర్ఫేఖాస్ భూములపై సంపూర్ణ హక్కులు ఎవరికి ఉండేవి ?
ఎ) నిజాం రాజు బి) దేశ్‌ముఖ్‌ సి) రైతులు డి) వతందారులు
12) పైగా జాగీర్లను మొదటగా నిజాం అలీ ఎవరికి ఇచ్చాడు ?
ఎ) అబ్దుల్లా ఖాన్ బి) షమ్స్-ఉల్-ఉమ్రా-1 సి) నిజాం ఉల్ ముల్క్ డి) రాందాసు
13) హైదరాబాద్ రాజ్యంలో మొగలులు పాలన ఎప్పుడు అంతమైంది ?
ఎ) 1720 బి) 1722 (సి) 1724 డి) 1725
14) ఖల్సా (దివానీ) భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అయితే వీటిని ఎవరు నియంత్రిస్తారు ?
ఎ) దివాన్ బి) నిజాం రాజు సి) సుబేదార్ డి) సదర్-ఉల్-మిహం-ఎ-మాల్ గుజారీ
15) 1851 నాటికి హైదరాబాద్ సంస్థానం బ్రిటీష్ వారికి ఎంత బాకీ ఉంది ?
ఎ) 50 లక్షలు బి) 75 లక్షలు సి) 95 లక్షలు డి) 70 లక్షలు