Monday, September 23

పంచాయతీ రాజ్ లో 311 పోస్టులు

రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 311 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 23 జిల్లాల్లో వివిధ కేటగిరీల్లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి

1) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) : 23 పోస్టులు

2) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : 23 పోస్టులు

3) జిల్లా పంచాయతీ అధికారి : 23 పోస్టులు

4) డివిజినల్ పంచాయతీ అధికారి : 40 పోస్టులు

5)మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(MPDO): 101

6) మండల పంచాయతీ అధికారి : 101

ఈ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదోన్నతులు, ఇతర రూపాల్లో సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కు అనుమతి ఇస్తారు.

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్నది పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయిస్తుంది. ఆ తర్వాతే నోటిఫికేషన్ పడుతుంది... అప్పుడే విద్యార్హతలు, ఇతర వివరాలు అందుబాటులోకి వస్తాయి.

 

తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో అన్ని ఎగ్జామ్స్ కి పనికొచ్చేలా 100 రోజుల మాక్ టెస్టులు

100 రోజుల మాక్ టెస్టుల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి