Monday, November 18

త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలు, కోచింగ్ లేకున్నా ఎలా జాబ్ సంపాదించాలి?

త్వరలో మరో 15 వేల పోలీస్ కొలువులను తెలంగాణలో భర్తీ చేయబోతున్నారు...

మరో 15 వేల పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ పడుతుంది అని... పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులు ఉన్నతాధికారుల సోర్స్ తో ఐటెమ్స్ఇచ్చారు...

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

ఇప్పటికే 18 వేల 500 పోస్టులకు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చివరి దశకు వచ్చింది... మరో వారం, 10 రోజుల్లో 17 వేల 156 మంది కానిస్టేబుల్స్... 12 వందల 75 మంది SI లు ట్రైనింగ్ కు వెళ్ళిపోతారు.  ఈ సెలక్షన్ ప్రొసీజర్ పూర్తి కాగానే... కొద్ది రోజుల్లోనే మరో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ప్రయత్నాలు ప్రారంభించనుంది.

ఇప్పుటి వరకూ జరిగిన రిక్రూట్ మెంట్ అంటే 18 వేల 500 పోస్టుల భర్తీ ప్రక్రియ పాత జిల్లాల ప్రకారం జరిగింది... రాబోయే 15 వేల పోలీస్  ఉద్యోగాల నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రకారం ఉండనుంది.  అంటే 33 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ వేస్తారు.

కొత్త జిల్లాలు, జోనల్ ప్రక్రియకు రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాతే ... మన రాష్ట్రంలో కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు పడే అవకాశముందని నేను ముందు నుంచే చెబుతున్నాను.  ఇప్పటికే TSPSC గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 3, మున్సిపల్ పోస్టులు కూడా ఈ కారణంగానే ఆగిపోయాయి.  Once zonal ఇష్యూ క్లియర్ అయితే డెఫినెట్ గా నోటిఫికేషన్లు పడతాయి.

అసలు కోచింగ్ లేకుండా ఈ ఉద్యోగాలను ఎలా సంపాదించాలో ఈ వీడియోలో వివరించాను... please watch