Wednesday, September 18

జూన్ లోనే పోలీస్ ట్రైనింగ్ ప్రారంభం

పోలీస్ ఉద్యోగాల ఫైనల్ కీని కూడా ఇప్పటికే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. జూన్ మొదటి వారంలో అభ్యర్థులకు ఎంపిక చేసి ఇదే నెల నుంచే ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు పోలీస్ ఉన్నతాధికారులు. జూన్ నెలాఖరు నుంచి 1250 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభిస్తారు. అలాగే జులై మొదటి వారం నుంచి 17 వేల మంది కానిస్టేబుల్స్ కి ట్రైనింగ్ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ట్రైనింగ్ సెంటర్లలో ప్రారంభించారు.
జూన్ మొదటి వారంలో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. ఆయా జిల్లాల్లోనే వీరి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్లను లెక్కలోకి తీసుకొని కటాఫ్ మార్కులు ప్రకటిస్తారు. ఆ తర్వా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో గతంలో 13 వేల మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు 18 వేల మంది అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది.

క్లాసుల్లో ఓరల్ లెసన్స్ తో పాటు గ్రౌండ్ లో శిక్షణ కూడా ఉంటుంది. అందుకోసం తెలంగాణ ప్రత్యేక పోలీస్ పటాలానికి చెందిన 10 గ్రౌండ్స్ అలాగే ఐఆర్ బెటాలియన్ కు చెందిన మూడు గ్రౌండ్స్ ను వాడుకుంటారు. వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వెయ్యి మంది ట్రైనర్స్ కూడా పోలీస్ శాఖ సిద్ధం చేసింది. మూడు బ్యాచ్ లుగా విభజించి ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు.