Monday, June 24

ఈనెల 27న పోలీస్ ఉద్యోగాల ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీస్ ఉద్యోగాల ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ఈనెల 27 ను TSLPRB ప్రకటించనుంది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

SI ఉద్యోగాలకు : మొత్తం 50,861 మంది హాజరవగా... 36వేల 829 మంది క్వాలిఫై అయ్యారు ( 72.41 శాతం ఉత్తీర్ణత)

PC ఉద్యోగాలకు : మొత్తం 1,03,671 మంది హాజరవగా, 93,211 మంది క్వాలిఫై అయ్యారు.( 89.91 శాతం ఉత్తీర్ణత)

తుది ఫలితాలను ఈనెల 27 నుంచి www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. అదే రోజు అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను కూడా వెబ్ సైట్ లో ఉంచుతున్నారు. అభ్యర్థులు లాగిన్ అయి తమ కాపీలను చూసుకోవచ్చు.

రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు రూ.3000 ఫీజులు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.2000 వేలు పే చేయాలి. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ సదుపాయం ఈనెల 28 ఉదయం 8 గంటల నుంచి 30 వ తేదీ రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది.

పూర్తి వివరాలకు ఈ కింద లింక్ క్లిక్ చేయండి

Announcement_of_Qualifications