Wednesday, June 19

పోలీస్ అప్లికేషన్లో తప్పుల గురించి వర్రీ వద్దు

పోలీస్ రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ లో తప్పుల గురించి టెన్షన్ పడొద్దని సూచించారు TSLPRB ఛైర్మన్ వివి శ్రీనివాసరావు. తప్పులు సరిదిద్దుకోవాలంటూ బోర్డుకి దరఖాస్తులు, మెయిల్స్, మెస్సేజ్ లు పంపవద్దని కోరారు. ఫైనల్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత అభ్యర్థులందరికీ తప్పులు దిద్దుకోడానికి అవకాశం ఇస్తామన్నారు. సరైన టైమ్ లో ఎడిట్ ఆప్షన్ కల్పిస్తామని తెలిపారు TSLPRB ఛైర్మన్.

99.9శాతం పెర్ఫార్మెన్స్ షీట్స్ జారీ చేశాం

పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫిట్నెస్ టెస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో 99.5శాతం మందికి Performance Sheets జారీ చేసినట్టు tslprb తెలిపింది. నాలుగైదు వారాలుగా జరుగుతున్న ఫిట్నెస్ టెస్టుల్లో 2,7,361 మందికి షీట్స్ ఇష్యూ చేశారు. www.tslprb.in వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ షీట్స్ తీసుకోవచ్చన్నారు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు. ఇంకా 250 మందికి సంబంధించి షీట్స్ టెక్నికల్ కారణాలతో తాత్కాలికంగా నిలిచిపోయామని తెలిపారు. సాంకేతిక సమస్యలు తొలగిపోగానే వాటిని కూడా అప్ లోడ్ చేస్తామన్నారు.

మార్చి 28, 29 ల్లో బ్యాక్ లాగ్ అభ్యర్థుల కేసుల పరిశీలన

వివిధ కారణాలతో చివరి నిమిషంలో ఫిట్నెస్ టెస్టులకు గైర్హాజరు అయిన వారి అభ్యర్థనలను ఈనెల 28, 29 తేదీల్లో నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. SAR CPL అంబర్ పేట, హైదరాబాద్ తో పాటు మిగతా 11 ఫిట్నెస్ కేంద్రాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు ఈ పరిశీలన జరుగుతుంది.

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

TSLPRB PRESS NOTE

పోలీస్ ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు !: TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు

http://teluguword.com/tslprb/