Friday, September 20

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్

- అందరికీ బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 28 ఆగస్టు 2014లో అమల్లోకి తెచ్చింది. నాలుగేళ్ళ పాటు అమల్లో ఉండేలా పథకం రూపొందించగా, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.
- దేశంలో బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల మంది ఖాతా తెరిచి, రూపే డెబిట్ కార్డులను పంపిణీ చేయాలన్నది మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు.
^ ప్రస్తుత ఖాతాలు : 32.41 కోట్లు, వీటిల్లో సొమ్ము : రూ.81,200 కోట్లు
- ఖాతాదారులకు మొదట్లో 1లక్ష రూపాయల ప్రమాద బీమా, మరణిస్తే రూ.30వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉచిత బీమా సౌకర్యం రూ.2 లక్షలు చేశారు.
- మొదట్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం రూ.5 వేలు ( 6 నెలల పాటు ఖాతాను నిర్వహించాలి ) ఇప్పుడు రూ.10 వేలు చేశారు
- ఖాతాదారుల్లో మహిళలు 53శాతం మంది ఉన్నారు.