1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం

1) 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని ఎవరు రూపొందించారు ?
జ: బ్రిటన్ ప్రధాని విలియమ్ పిట్స్
2) 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం భారత్ లో పరిపాలనను రెండు విధాలుగా విడగొట్టారు. అవి ఏంటి ?
జ: (1) రాజకీయ వ్యవహారాలు(2) వ్యాపార వ్యవహారాలు
3) 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం రాజకీయ, వ్యాపార వ్యవహారాల నియంత్రణకు ఏ వ్యవస్థలను ఏర్పాటు చేశారు ?
జ: రాజకీయ వ్యవహారాల నియంత్రణకు – బోర్డ్ ఆఫ్ కంట్రోల్
వ్యాపార వ్యవహారాల నియంత్రణకు – కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్
4) స్థానిక సంస్థలకు చట్టబద్ధత ఏ చట్టం ప్రకారం కల్పించారు ?
జ: 1793 చార్టర్ చట్టం
5) ఈస్టిండియా కంపెనీకి మరో 20యేళ్ళ పాటు వ్యాపారం చేసుకునే అవకాశం ఏ చట్టం ద్వారా కలిగింది ?
జ: 1793 చార్టర్ చట్టం
6) మొదటిసారిగా క్రిస్టియన్ మిషన్ కి ఆహ్వానం, భారత్ లో విద్యావ్యాప్తికి లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు... ఏ చట్టం ప్రకారం జరిగాయి ?
జ: 1813 చార్టర్ చట్టం
7) బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్పు ఏ చట్టం ప్రకారం జరిగింది ?
జ: 1833 చార్టర్ చట్టం
(నోట్: ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తి : విలియం బెంటింక్ )
8) భారతీయులకు మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఏ చట్టం ప్రకారం కల్పించారు ?
జ: 1833 చార్టర్ చట్టం
9) 1833 చార్టర్ చట్టం ప్రకారం లా కమిషన్ ఏర్పాటైంది. అయితే మొదటి లా కమీషన్ ఛైర్మన్ ఎవరు ?
జ: లార్డ్ మెకాలే.
10) భారత్ లో మొదటిసారిగా బానిస వ్యవస్థను ఏ చట్టం ద్వారా రద్దు చేశారు ?
జ: 1833 చార్టర్ చట్టం
( నోట్: కానీ లార్డ్ ఎలిన్ బరో వ్యతిరేకతతో దీన్ని అమలు చేయలేదు)
11) సివిల్ సర్వీస్ పరీక్షల్లో భారతీయులకు ప్రవేశం ఏ చట్టంతో చేశారు ?
జ: 1833 చార్టర్ చట్టం
(నోట్: కోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ వ్యతిరేకతతో అమలు చేయలేదు)
12) విక్టోరియా మహారాణి ప్రకటనతో ఏ చట్టం అమల్లోకి వచ్చింది ?
జ: 1858 భారత ప్రభుత్వ చట్టం
13) సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ చట్టం తీసుకొచ్చి... దేశంలో కంపెనీ పాలనను రద్దు చేశారు. ఏ చట్టం అది ?
జ: 1858 భారత ప్రభుత్వ చట్టం
14) ఏ చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్ పదవి ఇకపై బ్రిటీష్ వైస్రాయిగా మార్చారు ? మొదటి వైశ్రాయి ఎవరు ?
జ: 1858 భారత ప్రభుత్వ చట్టం, మొదటి వైశ్రాయి: లార్డ్ కానింగ్
15) 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మన దేశ పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్లింది ?
జ: బ్రిటీష్ రాణి సార్వభౌమాధికారంలోకి
16) లండన్ లో భారత రాజ్యాంగ కార్యదర్శి పదవిని ఏ చట్టం ప్రకారం సృష్టించారు ?
జ: 1858 భారత ప్రభుత్వ చట్టం
(నోట్: రాజ్యాంగ కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి 15మంది సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటు. మొదటి కార్యదర్శి చార్లెస్ ఉడ్స్ )
17) ఏ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా పేర్కొంటారు ?
జ: 1858 భారత ప్రభుత్వ చట్టం
18) 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని విక్టోరియా రాణి భారత ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ఎలాంటిదని అభివర్ణించారు ?
జ: ‘మాగ్నా కార్టా’
19) ఏ చట్టాన్ని అనుసరించి 1862లో మొదటిసారిగా హైకోర్టును ఏర్పాటు చేశారు ?
జ: 1861 కౌన్సిల్ చట్టం
20), శాసనమండలి ఏర్పాటు, పోర్ట్ ఫోలియో విధానం ఎప్పుడు మొదలైంది ?
జ: 1861 కౌన్సిల్ చట్టం
21) కేంద్ర శాసనమండలిలో 1) పాటియాలా మహారాజు 2) బెనారస్ మహారాజు 3) సర్ దినకర్ రావు అనే ముగ్గురు భారతీయులకు ఏ చట్టం ప్రకారం స్థానం కల్పించారు ఝ
జ: 1861 కౌన్సిల్ చట్టం
22) బొంబాయి, మద్రాస్ ల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు ?
జ: 1861 కౌన్సిల్ చట్టం
23) కేంద్ర శాసన సభలో భారతీయుల ప్రాతినిధ్యం 6కు పెంచడానికి కారణమైన చట్టం ఏది ?
జ: కౌన్సిల్ చట్టం, 1892
24) కౌన్సిల్ చట్టం, 1892 ప్రకారం కేంద్ర శాసనసభలో ఎవరెవరికి (భారతీయులకు) ప్రాతినిధ్యం కల్పించారు ?
జ: 1) సురేంద్రనాథ్ బెనర్జీ 2) గోపాల కృష్ణ గోఖలే 3)దాదాభాయి నౌరోజీ 4) ఫిరోజ్ షా మెహతా 5)రాజ్ బిహారీ ఘోష్ 6) బిల్ గ్రామీ
(నోట్: బడ్జెట్ మినహా పరిపాలన అంశాలపై ప్రశ్నించే అవకాశం వీరికి కల్పించారు )
25) మింటో మార్లే సంస్కరణలు అని వేటిని అంటారు ?
జ: 1909 భారత ప్రభుత్వ చట్టం
26) 1909 భారత ప్రభుత్వ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలను ఎవరు తయారు చేశారు ?
జ: భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, గవర్నర్ జనరల్ లార్డ్ మింటో
27) మతప్రాదిపదికన ముస్లిమ్ లకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు ఏ చట్టం ప్రకారం జరిగింది ?
జ: 1909 భారత ప్రభుత్వ చట్టం
28) గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంపు ఏ చట్టం ప్రకారం చేశారు ?
జ: 1909 భారత ప్రభుత్వ చట్టం
29) క్రిమినల్ నేరాలకు పాల్పడితే ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం ఎప్పుడు విధించారు ?
జ: 1909 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం
30) కౌన్సిళ్ళ సభ్యుడిగా నియమించిన మొదటి భారతీయుడు ఎవరు ?
జ: సత్యేంద్ర ప్రసాద్ సిన్హా (ఎస్ పి సిన్హా)