Wednesday, May 22

పీజీ వైద్య ప్రవేశాలకు నీట్ కటాఫ్ తగ్గింపు

నీట్‌ కటాఫ్‌ మార్కులను 6 పర్సంట్ తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కటాఫ్‌ తగ్గడంతో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ కి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది కాళోజి యూనివర్సిటీ.
ఈ నెల 10 నుంచి 12 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే13 ధృవపత్రాలను పరిశీలిస్తారు. పీజీ వైద్య విద్య కటాఫ్ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2019-20 పీజీ కటాఫ్‌ మార్కులను 6 పర్సంటేజ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.... జనరల్‌ అభ్యర్థులు 44 పర్సంటేజ్ లో 313 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 34 పర్సంటేజ్ లో 270 మార్కులు, దివ్యాంగులకు 39 పర్సంటేజ్ కి 291 మార్కులుగా కటాఫ్‌ గా నిర్ణయించారు.

మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ http://www.knruhs.in చూడొచ్చని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు.