Thursday, August 22

అన్ని యూనివర్సిటీల PG కి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ !

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఒకే PG ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో వివిధ ఎంట్రన్స్ టెస్టులు జరుగుతున్నాయి. ఒకే ఎంట్రన్స్ నిర్వహిస్తూ దాని బాధ్యతలను ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది ఉన్నత విద్యామండలి. ఛైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి.

KU టెస్ట్ - కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో ప్రవేశాలకు

OU టెస్ట్ - ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో ప్రవేశాలకు

ఇలా రెండు టెస్టులతో విద్యార్థులకు ఆర్థికంగా భారంతో పాటు, రెండు వేర్వేరు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయి రాయాల్సి వస్తోంది. ఇకపై ఈ ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించారు.
2019-20 MA, MCom, MSc., తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్షను ఉస్మానియా నిర్వహించనుంది. ఈ ఉమ్మడి పీజీ ఎంట్రన్స్ కి ఛైర్మన్ గా OU వైస్ ఛాన్సలర్ ప్రొ. రామచంద్ర నియమితులయ్యారు.