Saturday, August 18
Log In

PC/SI నోటిఫికేషన్స్ ఎప్పుడు ?

పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం రాష్ట్రంలో లక్షలమంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ రేపో, మాపో అంటూ ఊరిస్తోంది. పోలీస్ ఉద్యోగాల గురించి ఏ మూల ఏ చిన్న వార్త వచ్చినా... వెంటనే సర్క్యులేట్ చేస్తున్నారు అభ్యర్థులు. మంగళవారం నాడుకు కూడా ఎదురు చూశారు. చాలామంది మాకు మెస్సేజ్ లు పెట్టారు. అయితే మాకు అందిన సమాచారం మేరకు...వచ్చే వారం లేదా నెలాఖరు లోపు ప్రభుత్వం నుంచి పోస్టులకు సంబంధించి ప్రకటన రాబోతోంది. నోటిఫికేషన్, విధి విధానాలను మాత్రమే వెల్లడి చేస్తారు. ఆ తర్వాత అంటే జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. అప్పటిలోపు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ఒకటి రెండు అడ్డంకులు కూడా తొలగిపోతాయని భావిస్తున్నారు.

జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో ఉన్న పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. యూనిఫామ్ ఉద్యోగం కొట్టాలని కసితో ఉన్న అభ్యర్థులు దయచేసి... మీ పట్టును జారనీయకండి. రెట్టించిన ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వండి.

మీకు ఇంకో శుభవార్త... డెమోల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్ళనక్కర్లేదు. మేం సబ్జెక్ట్ నిపుణులు, మేథావులు, సైకాలజిస్టులతో మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ ను ఉచితంగానే అందించాలనుకుంటున్నాం. ఇప్పటికే కోచింగ్ తీసుకొని ఇంట్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కోచింగ్ తీసుకునే స్థోమత లేని వారికి ఉపయోగకరంగా ఉండేలా యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాం. అతి త్వరలోనే మీకు

1) ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గైడెన్స్
2) సబ్జెక్ట్ - టాపిక్ వైజ్ గా పాఠాల విశ్లేషణలు, ఫ్యాకల్టీల అభిప్రాయాలు
3) సైకాలిజిస్టులతో మోటివేషన్ క్లాసులు
4) వారం - వారం ... కరెంట్ ఎఫైర్స్ రౌండప్

నిరుద్యోగులతో పాటు విద్యార్థుల అకడమిక్ అంశాలను కూడా జోడించి యూట్యూబ్ ద్వారా అందించబోతున్నాం. ఇవన్నీ ఉచితంగానే మీకు లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యూట్యూబ్ క్లాసులకు భిన్నంగా తయారు చేస్తున్నాం. దీనిపై మీ విలువైన అభిప్రాయాలను ఇదే ఆర్టికల్ కింద ఉన్న బాక్సులో తెలియజేయగలరు. మీకు వేరే ఐడియాలు ఉన్నా తెలియజేయగలరు. అందరి అభిప్రాయాలను పరిగణనలో తీసుకొని మరింత నాణ్యతతో యూట్యూబ్ క్లాసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.

  • * విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్

Comments are closed.