Sunday, February 23

కానిస్టేబుల్స్ శిక్షణ ప్రారంభం ! నేర చరిత్ర ఉన్న 300మందికి నో ట్రైనింగ్ !!

పోలీస్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ అయిన స్టైఫండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణా కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ లోని CAR హెడ్ క్వార్టర్స్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంశాహ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అజంనీ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 267 మంది కానిస్టేబుల్స్ కి 9 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. తమ ప్రభుత్వ వచ్చాకే ఎక్కువగా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. అలాగే కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికైన వారిలో 300మందికి నేర చరిత్ర ఉందనీ... వాళ్ళని చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. వారిపై పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పారు. నైపుణ్యం, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతామని అన్నారు సీపీ అంజనీ కుమార్. 9 నెలల శిక్షణ విధుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.