Monday, September 24
Log In

జూన్ 1 లేదా 2 న పోలీస్ నోటిఫికేషన్

రాష్ట్రంలో 18వేల పోస్టులతో పోలీస్ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ రెడీ అయింది. జూన్ 1 లేదా 2న నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్స్ తో పాటు, బెటాలియన్లు, ఆర్ముడ్ రిజర్వ్, ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. పోలీసు పోస్టుల రిక్రూట్ మెంట్ విధానంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. గతంలో లాగే నిర్వహించనున్నారు.  ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. సివిల్ కేటగిరీలో 33శాతం, ఆర్ముడ్ రిజర్వ్ కేటగిరీలో 10శాతం మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది.

ఆన్ లైన్ ఎగ్జామ్ లేదు

ఈసారి ఆన్ లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులు భావించారు. అందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే లక్షలమంది హాజరవుతుండటంతో ఆన్ లైన్ నిర్వహణ కష్టమని భావించారు. అందుకే రాత పరీక్షలను ఆఫ్ లైన్ లోనే నిర్వహిస్తారు.

వయో సడలింపు మాటేంటి ?

నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న వయోసడలింపుపై ఇంకా సందేహం నెలకొంది. ప్రభుత్వం tspsc ఉద్యోగాలకైతే సడలింపు ఇచ్చింది. యూనిఫామ్ పోస్టుల విషయంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి రిప్లయ్ రాలేదు. దాంతో ప్రసుతం ఇచ్చే నోటిఫికేషన్ లో సడలింపు ప్రసక్తి ఉండదు. ఆ తర్వాత నిరుద్యోగుల రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం అనుమతి ఇస్తే... అప్పుడు సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఈ ఉద్యోగాలకు 7 నుంచి 8 లక్షల మందికి పైగా పోటీ పడతారని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

నోట్:

ప్రస్తుతం telanganaexams.com వెబ్ సైట్ నుంచి మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  వచ్చే నెలలో ఆఫ్ లైన్ లో గ్రాండ్ టెస్టులకు ఏర్పాట్లు చేస్తున్నాం.  హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.  ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. అలాగే ఇప్పుడు ఆన్ లైన్ టెస్టులు రాస్తున్న వారికి జూన్ రెండో వారం నుంచి ప్యాటర్న్ మారుస్తున్నాం.  వీకెండ్స్ లో మిమ్మల్ని పరీక్షించుకునేలా ఆ వారం మొత్తం జరిగిన ఎగ్జామ్స్ నుంచి గ్రాండ్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం. 

SI/PC/VRO/GR.I,II & IV మాక్ టెస్టులు

Comments are closed.