Monday, November 12
Log In

కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు ఆదేశాలు

పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్షల మార్కులు వెల్లడించాలని తెలంగాణ పోలీస్ నియామక మండలితో పాటు హోంశాఖకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులకు లోబడే నియామకాలు లోబడి ఉంటాయని ఆదేశాలిచ్చింది. కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణ తీరును తప్పుబడుతూ డి.గిరీష్ తో పాటు 200 మందికి పైగా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు విచారణ చేపట్టారు.

అభ్యర్థులు లేవనెత్తిన ప్రశ్నలు, హైకోర్టుకి అభ్యర్థనలు:

1) పరీక్షలో ప్రశ్నలు SSC లేదా ఇంటర్ స్థాయికి మించి ఉన్నాయి

2) కొన్ని ప్రశ్నలకు ఆప్షనల్స్ (ఐచ్ఛికాలు) లేవు

3) ఆప్షనల్స్ లేని ప్రశ్నలకు సమాధానాలు రాకపోయినా మార్కులు ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం

4) కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారు

5) కొన్ని ప్రశ్నలకు తెలుగు అనువాదంలో తప్పులు చేశారు

6) ప్రశ్నా పత్రాలను నిపుణుల కమిటీకి పంపాలి. విద్యార్హత స్థాయికి మించి ఉన్న ప్రశ్నలు, క్లిష్టమైనవి, తప్పు ఆప్షనల్స్ ఉన్నవి, తప్పు ప్రశ్నలను గుర్తించి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి

7) ఇప్పటికే శారీరక దారుఢ్య పరీక్షల కోసం ప్రకటించిన అర్హుల జాబితాని రద్దు చేయాలి. కొత్త జాబితా ప్రకటించాలి

8) కొత్త లిస్ట్ ప్రకటించేదాకా శారీరక దారుఢ్య పరీక్షలు, నియామక ప్రక్రియ నిలిపివేయాలి.

ఇప్పటికే అర్హులుగా ప్రకటించిన వారితో పాటు అర్హత సాధించని వారి మార్కులను వెల్లడించాలని పిటిషనర్లు కోరారు. దాంతో ఫైనల్ కీతో పోల్చుకొని, అర్హతలను గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అభ్యర్థుల వాదన విన్న న్యాయమూర్తి పరీక్షలు రాసిన అందరు అభ్యర్థుల మార్కులను వెల్లడించాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించారు. తమ తదుపరి ఉత్తర్వులకు లోబడే నియామకాలు ఉంటాయన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్ నియామక మండలితో పాటు హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/