ఆపరేషన్ పోలో – హైదరాబాద్ సంస్థానం విలీనం -1

 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం నవాబు

1) హైదరాబాద్ సంస్థానం విలీనానికి భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి ?
జ: ఆపరేషన్ పోలో (ఆపరేషన్ కాటర్ పిల్లర్)
2) నిజాం రాజ్యంపైకి భారత్ సర్కార్ ఎప్పుడు సైన్యాన్ని పంపింది ?
జ: 1948 సెప్టెంబర్ 13న
3) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయింది ?
జ: 1948 సెప్టెంబర్ 17న
4) యథాతధ ఒడంబడిక ఎవరెవరి మధ్య కుదిరింది ? ఎప్పుడు ?
జ: 29 నవంబర్ 1947న.. భారత ప్రభుత్వం - నిజాం రాజుకి మధ్య
5) భారత్ యూనియన్ లో హైదరాబాద్ ను చేర్చడానికి కృషి చేసిన చివరి బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు ?
జ: లార్డ్ మౌంట్ బాటెన్

6) మజ్లీస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (రజాకార్ల ఉద్యమం)కు ఎవరు నాయకత్వం వహించారు ? వాళ్ళ నినాదం ఏంటి ?
జ: కాశీం రజ్వీ. ఆజాద్ హైదరాబాద్
7) హైదరాబాద్ కు ఏమని పేరుపెట్టాలని పంజాబ్ కు చెందిన చౌదరి హకమత్ అలీగుజర్ సూచించారు ?
జ: ఉస్మానిస్తాన్
8) సర్వస్వతంత్రుడని నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు ప్రకటించుకున్నాడు ?
జ: 1947 జూన్ 12న
9) హైదరాబాద్ ను భారత్ యూనియన్ లో విలీనం అయ్యేట్టు నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ పై ఒత్తిడి తేవాలని పిలుపు ఇచ్చింది ఎవరు ?
జ: కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ్
( 1947 మే7న హైదరాబాద్ లోని కర్బలా మైదానంలో జరిగిన సభలో)
10) నిజాంచే రాజ్యబహిష్కరణకు గురైన సోషలిస్ట్ నాయకుడు ఎవరు?
.జ: జయప్రకాశ్ నారాయణ్
11) నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన ప్రజా ఉద్యమం ఏది ?
జ: జాయిన్ ఇండియా ఉద్యమం
(నోట్: స్వామి రామానంద తీర్థ ఈ ఉద్యమాన్ని 1947 ఆగస్టు 7న ప్రారంభించారు)
12) ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్ లోని ఎక్కడ, ఎవరు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ?
జ: సుల్తాన్ బజార్ లో... మోతీలాల్ మంత్రి
13) యధాతథ ఒప్పందంపై సంతకం చేశాక కూడా... నిజాం నవాబు ఎవరితో విదేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు తెప్పించుకున్నాడు?
జ: ఆస్ట్రేలియాకి చెందిన సిడ్నీ కాటన్ తో (రెండో ప్రపంచ యుద్ధంలో పైలట్ గా పనిచేశాడు)
14) సిడ్నీ కాటన్ విదేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకోడానికి ఉపయోగించిన విమానాశ్రయాలు ఏవి ?
జ: బీదర్, మామునూరు
15) నిజాం నవాబు ఆయుధాలు తెప్పించుకుంటున్నాడని భారత ప్రభుత్వానికి సమాచారం ఎవరు ఇచ్చారు ?
జ: వందేమాతరం రామచంద్రరావు, కె.ఎం.మున్షీ
16) ఆంధ్ర మహాసభను సంఘంగా మార్చి మిలిటెంట్ తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టినది ఎవరు ?
జ: దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల సోదరులు, బద్దం ఎల్లా రెడ్డి తదితరులు
17) భూస్వామ్య దోపిడీలను ఎదురించినందుకు ప్రాణాలు కోల్పోయిన మొదటి వ్యక్తి ఎవరు ?
జ: 1942లో కామారెడ్డి గూడెంలో షేక్ బందగీ ( విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు)
18) 1946 జులై 4న విసూరు దేశముఖు గూండాల తుపాకీ గుళ్ళకు బలైనది ఎవరు ?
జ: దొడ్డి కొమరయ్య
19) ఆపరేషన్ పోలో కంటే ముందు ఆయుధాలను సమకూర్చుకోడానికి యూరప్ కు వెళ్ళిన హైదరాబాద్ సైనికాధిపతి ఎవరు ?
జ: మేజర్ జనరల్ సయీద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్
20) ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీల జెండా ఎగరేస్తానని ... యువతను రెచ్చగొట్టింది ఎవరు ?
జ: రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ
21) కాశీం రజ్వీ ఒత్తిడితో నిజాం రాజు ఎవరిని ప్రధానిగా నియమించాడు ?
జ: మీర్ లాయక్ అలీ
22) కమ్యూనిస్టులపై నిజాం ప్రభుత్వం ఎప్పుడు నిషేధం ఎత్తి వేసింది ?
జ: 1948 మే4
23) ఆజాద్ హైదరాబాద్ నినాదాన్ని బలపరచిన నాయకులు ఎవరు ?
జ: హైదరాబాద్ సిటీ కమ్యూనిస్టు పార్టీ నేతలు
24) రజాకార్ల దురాగతాలకు హెడ్ క్వార్టర్స్ గా మార్చి.. ఎక్కడి నుంచి రజ్వీ తన కార్యకలాపాలను సాగించాడు ?
జ: దారుసలామ్ లోని శాంతి నిలయం
25) భారత ప్రభుత్వంతో హైదరాబాద్ విలీన సెటిల్ మెంట్ చేసుకోవాలని సలహా ఇచ్చిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ?
జ: లార్డ్ మౌంట్ బాటన్ ( 1948 మే 25న ప్రధాని లాయక్ అలీతో సమావేశం)
26) భారత ప్రభుత్వం, నిజాం సర్కార్ తో రాజీ కోసం హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ రూపొందించినది ఎవరు ?
జ: భారత ప్రభుత్వ కార్యదర్శి వి.పి.మీనన్, మీర్ లాయక్ అలీ
27) భారత్ సర్కార్, నిజాం ప్రభుత్వం మధ్య సంధి కుదర్చడానికి మౌంట్ బాటన్ ఎవరిని హైదరాబాద్ కు పంపారు?
జ: పత్రికల వ్యవహారాల కార్యదర్శి అలెన్ క్యాంప్ బెల్
28) హైదరాబాద్ ను పాకిస్తాన్ లో విలీనం చేయాలని కోరినది ఎవరు ?
జ: మహ్మద్ అలీ జిన్నా

29) హైదరాబాద్ సంస్థానాన్ని రాచపుండుగా వర్ణించి, దాన్ని తీసివేయాలని అన్నది ఎవరు ?
జ: భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్
30) హైదరాబాద్ పై సైనిక దాడి కోసం వ్యూహం రచించిన అప్పటి దక్షిణ కమాండర్ చీఫ్ ఎవరు ?
జ: లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్ గొడార్డ్ (ఆపరేషన్ కాటర్ పిల్లర్ రూపొందించింది ఈయనే)