Friday, May 29

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

మేం FBO ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర నుంచి దాదాపు ఏడాదిన్నరగా తెలంగాణలో విజయవంతంగా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వేల మంది మా ఎగ్జామ్స్ రాశారు. FRO/FSO దగ్గర నుంచి మొన్నటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి దాకా చాలామంది ఉద్యోగాలు పొందారు. నిన్న కూడా చాలామంది మెస్సేజెస్ పెట్టారు. అయితే ఇంకా కొందరికి మా ONLINE టెస్టుల మీద అవగాహన రావడం లేదు.

ప్రస్తుతం TSPSC, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర సంస్థలు ఆఫ్ లైన్ లో ( ఎగ్జామినేషన్ కేంద్రాల్లో ) పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఆన్ లైన్ లో టెస్టులు రాస్తే ఉపయోగం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా టెస్టులు రాసిన వారికి దీనిపై అవగాహన ఉంది. అయినప్పటికీ ఇంకా ఐడియా రానివాళ్ళకి దీనిపై క్లారిటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ టెస్టులతో మీరు మీ నైపుణ్యానికి ఇంకా ఎలా పదును పెట్టొచ్చో కూడా వివరిస్తాను. దాంతో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది.

ONLINE మాక్ టెస్టులతో ఉపయోగం ఏంటి ?

సాధారణంగా ఏ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లేదా విద్యాసంస్థలైన OFFLINE టెస్టులు నిర్వహిస్తుంటాయి. ఇవి గ్రాండ్ టెస్టులు మాత్రమే. ఇవి రాయడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే మేమునిర్వహించే మాక్ టెస్టుల స్వరూపమే వేరు.

1) మా మాక్ టెస్టులు సబ్జెక్ట్, లెసన్ వారీగా ఉంటాయి.

2) గతంలో మన బోర్డులు, రిక్రూట్ మెంట్ సంస్థలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ప్రశ్నలు అడిగేవి. కానీ పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రశ్నలు అడిగే సరళిని మార్చాయి.

దాంతో మా కొశ్చన్స్ ప్యాటర్న్ ఇలా ఉంది...

ఎ) స్టేట్ మెంట్స్

బి) జతపరచండి

సి) కాలక్రమంలో రాయండి

గతంలో మేం తయారు చేసిన మాక్ టెస్టులు Q &A రూపంలో ఉండేవి. కానీ జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శి మాక్ టెస్టులు మాత్రం సెకండ్ పేపర్ కోసం ప్రిపేర్ చేయించినవి... పూర్తిగా పైన పేర్కొన్న మూడు మెథడ్స్ లో ఉన్నాయి. దాంతో 75 నుంచి 90 శాతం మార్కుల వరకూ అభ్యర్థులు ప్రయోజనం పొందారు. వాస్తవానికి JPS ఎగ్జామ్ లో స్టేట్ మెంట్స్ టైప్ ప్రశ్నలు రాలేదు. అయినా మా మాక్ టెస్టులు రాసిన వారికి ఎక్కువ మెటీరియల్ చదివే అవకాశం ఏర్పడింది.

స్టేట్ మెంట్/జతపరచండి మోడల్ ప్రశ్నలతో ప్రయోజనం ఏంటి ?

ఇటీవల కాలంలో రిక్రూమెంట్ సంస్థలు తమ పంథా మార్చాయి అని చెప్పాను కదా.. మేం ఇలాంటి మాక్ టెస్టులు తయారు చేయించడం వల్ల... మీరు ఒక ప్రశ్నకు నాలుగు ఆన్సర్లు తెలుసుకుటారు. అవన్నీ STATEMENT మోడల్ లో ఉండటం వల్ల... ఒక్క ప్రశ్న చదివితే నాలుగు ప్రశ్నలు చదివిన ప్రయోజనం ఉంటుంది.

ఈసారి వర్తమాన, సమకాలీన అంశాలకూ ప్రాధాన్యత

మేం తయారు చేయిస్తున్న ప్రశ్నాపత్రాల్లో వర్తమాన, సమకాలీన అంశాలను కూడా జోడిస్తున్నాం. అది పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ... ఇలా సబ్జెక్ట్ ఏదైనా ప్రస్తుతం జరిగిన, జరుగుతున్న అంశాలు కవర్ అయ్యేలా రిక్రూట్మెంట్ సంస్థలు ప్రశ్నాపత్రాలు తయారు చేస్తున్నాయి. అందువల్ల మేం వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం.

కరెంట్ ఎఫైర్స్, జీకేకి ప్రియారిటీ !

మీ అందరికీ తెలుసు. మన వెబ్ సైట్ కరెంట్ ఎఫైర్స్ లో నెంబర్ ఒన్ అని. ఇటీవల కాలంలో CA లో కూడా స్టేట్ మెంట్స్ మోడల్స్ వస్తున్నాయి. అందుకే మేం మాక్ టెస్టుల్లో అలాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవి కాకుండా మీకు youtube ద్వారా కూడా ప్రత్యేక కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ తో కలిపి ఇస్తున్నాం.

మాక్ టెస్టులకు రోజువారీ ప్రణాళిక

చాలామందికి సిలబస్ ఎలా పూర్తి చేయాలన్నది చాలా డౌట్ ఉంటుంది.

  • చదివిన పాఠాలే చదువుతున్నామా ?
  • కొత్త టాపిక్స్ టచ్ చేయడం లేదా ?
  • మనం చదివిన పాఠాల్లో ఎంత వరకూ గుర్తుంటున్నాయి ?

ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. అందుకే మా మాక్ టెస్టులకు రోజువారీ ప్రణాళిక ఇచ్చాం. ప్రస్తుతం 50 రోజుల ప్రణాళిక ఇచ్చిన ఉద్దేశ్యం కూడా ఇదే. రోజుకి కొన్ని పాఠాలు ఇచ్చి... వాటిల్లో నుంచి 25 నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇవ్వడం వల్ల... మీరు ఆ పాఠాలు చదివిన వెంటనే మాక్ టెస్టులు రాసుకోవచ్చు. దాంతో లెసన్స్ పై ఇక ఎలాంటి డౌట్స్ ఉండవు.

మేం దాదాపు సిలబస్ అంతా కవర్ చేస్తున్నాం కాబట్టి... మీరు కూడా రోజువారీ ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ... సిలబస్ మొత్తం పూర్తి చేసినట్టు అవుతుంది.

మాక్ టెస్టులతో మీ నైపుణ్యానికి పదును !

చాలామంది పుస్తకాలు... పుస్తకాలు చదివేస్తూ ఉంటారు... తీరా ఎగ్జామ్ కి వచ్చే సరికి అవి కవర్ కాకపోతే... నేను చాలా బుక్స్ చదివినా అవి రాలేదని నిరుత్సాహ పడుతుంటారు.

అందుకే మీరు ఓ టెక్నిక్ అలవాటు చేసుకోవాలి....

మీరు మా మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత... అందులో ఇచ్చిన ప్రశ్నల సరళిని చూడాలి.

ఏ టైప్ లో ప్రశ్నలు అడుగుతున్నారు... ?

ఉదా: పంచవర్ష ప్రణాళికలు - వాటి లక్ష్యాలు గురించిన ప్రశ్న ఉందనుకోండి... మేం నాలుగైదు పాయింట్స్ ఇచ్చి జతపరచమని అడిగాం .. అప్పటి వరకూ మీరు ఆ ప్రశ్నకు సమాధానం రాయడం వరకూ ఓకే.

కానీ ...

  1. మిగతా ప్రణాళికల కాలంలో ఏమేమి లక్ష్యాలు పెట్టుకున్నారు ?
  2. అందులో ఏమేమి సాధించారు ?
  3. ఆయా ప్రణాళికల కాలంలో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి ?

లాంటివి .... మీ అంతట మీరు... మరోసారి రిఫరెన్స్ బుక్స్ తిరగేసి చదువుకోవాలి... దాని వల్ల ఆ సబ్జెక్ట్ లేదా ఆ టాపిక్ పై మీకు గ్రిప్ పెరుగుతుంది.

డిసెంబర్ 19 నాడు ఇచ్చిన పంచవర్ష  ప్రణాళికల మాక్ టెస్టులో... మేం కొన్ని పథకాల పేర్లు ఇచ్చి కాలక్రమంలో రాయమన్నాం. ఇది క్లిష్టమైన ప్రశ్న.

మీరు ఆ ప్రశ్నకు సమాధానం రాయడంతో సరిపోదు...

అసలు ఏయే ప్రణాళికల కాలంలో ఏయే పథకాలు వచ్చాయో తెలుసుకుంటే... వాటి కాలక్రమం రాయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇలాంటి రూపంలో మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో ప్రశ్నలు అడిగినా... అడగకున్నా... మీకయితే సబ్జెక్ట్ మీద గ్రిప్ రాయడం ఖాయం.

అందుకే మేం ఇచ్చిన ప్రశ్నలే దిగుతాయని చెప్పడం లేదు... కానీ లాజిక్ గా ఆలోచించి... మాక్ టెస్టులకు అదనంగా మీరు సబ్జెక్ట్ ను ఇంప్రూవ్ చేసుకుంటే... ఇది కాదు... ఇంకో ఎగ్జామ్ అయినా తప్పకుండా కొడతారు.

FAQs

మా మాక్ టెస్టులు రాస్తున్నవారు తరుచుగా అడుగుతున్న ప్రశ్నలు

1) ఇప్పుడు రాస్తున్న మాక్ టెస్టులు ఎప్పటిదాకా ఉంచుతారు ?
జ: మీ ఎగ్జామ్స్ అయ్యేదాకా ఉంచుతాం. గ్రూప్స్ నోటిఫికేషన్స్ కి కూడా అందుబాటులో ఉంచుతాం.
2) కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. మాక్ ఎగ్జామ్స్ రాస్తే చాలా ?
జ: ఒకే ... అందరూ కోచింగ్ తీసుకునే జాబ్స్ కొట్టడం లేదు. మీరు ప్లాన్ ప్రకారం స్టడీ మెటీరియల్ చదువుతూ మాక్ ఎగ్జామ్స్ రాసుకోండి.
3) నిన్న మాక్ టెస్టులు కనిపించాయి... ఇవాళ కనిపించడం లేదు.
జ: మాక్ టెస్టులు ఒకసారి లోడ్ చేశాక... మళ్ళీ మళ్లీ మార్చడం, తీసేయ్యడం జరగదు. మీరు లాగిన్ అయితేనే కనిపిస్తాయి.
4) మేము ఇప్పుడు ఫీజు కడితే పాత టెస్టులు వస్తాయా ?
జ: గ్యారంటీగా వస్తాయి... లాగిన్ అవ్వగానే... మీకు పాత టెస్టులన్నీ ఓపెన్ అవుతాయి. ఎప్పుడు ఫీజు కట్టినా వస్తాయి. డేస్ మిస్ కావొద్దని అనుకుంటే వీలైనంత తొందరగా పే చేసి మాక్ టెస్టులు రాసుకోండి.

All the best

Vishnu Kumar M,Senior Journalist

మా టెస్టుల సరళి తెలుసుకోడానికి ఈ వీడియో చూడండి