Tuesday, September 25
Log In

ఆన్ లైన్ లోనే రైల్వే ఎగ్జామ్స్

గ్రూప్ -సి, డి పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లోనే ఎగ్జామ్ నిర్వహించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. అన్ని జోన్లకి కలిపి దాదాపు 88 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందుకోసం 2.37 కోట్ల మంది అప్లయ్ చేసుకున్నారు. అంతమందికి ఆన్ లైన్ లో నిర్వహించడం కష్టమని మొదట రైల్వే వర్గాలు భావించాయి. అయితే తర్జన భర్జనల తర్వాత ఆన్ లైన్ కే మొగ్గు చూపాయి. ఆఫ్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలంటే ఏకంగా 7.5 కోట్ల పేపర్లు కావాలి. అంత పెద్ద సంఖ్యలో షీట్స్ తయారు చేయడానికి 10 లక్షల చెట్లు అవసరమవుతాయి. పైగా అన్ని భాషల్లో ప్రింట్ చేయాలంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది. అందుకే ఆన్ లైన్ లోనే బెటర్ అని నిర్ణయానికి వచ్చాయి. అంతేకాకుండా ఆఫ్ లైన్ లో పెడితే క్వొశ్చన్ పేపర్స్ లీకేజీ సమస్య కూడా ఉంది. ఆన్ లైన్ లో ఆ ప్రాబ్లెమ్ ఉండదు.

పాయింట్స్ మాన్, గేట్ మాన్, ట్రాక్ మాన్ తో పాటు టెక్నీషియన్, అసిస్టెంట్ లోకోపైలట్ లాంటి అన్ని పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా 300  సెంటర్లు ఏర్పాటు చేయాలని రైల్వే వర్గాలు నిర్ణయించాయి.

అప్లికేషన్ ఫీజుల విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థుల నుంచి రూ.500లు, SC/ST అభ్యర్థుల నుంచి రూ.250 వసూలు చేశారు. అయితే టెస్టులకు హాజరైన అభ్యర్థులకు వీటిని రిఫండ్ చేయనున్నారు. పేమెంట్ చేసిన ఫీజుల్లో ఓసీలకు రూ.400, SC/ST, దివ్యాంగులు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వారు తదితరులకు మొత్తం అమౌంట్ రిఫండ్ చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో 5 లేదా 10 శాతం మంది మాత్రమే ఎగ్జామ్ కి గైర్హాజరు అయ్యే అవకాశం ఉండొచ్చనీ... ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆన్ లైన్ ఎగ్జామ్ టైమ్ లో వెబ్ సైట్ ప్రాబ్లెమ్ రాకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నాయి.

 

RRB (గ్రూప్ C &D)ఆన్ లైన్ లో 10 గ్రాండ్ టెస్టులు
(డిస్కౌంట్ రేటు ఈనెల 25 వరకూ పొడిగింపు)
https://telanganaexams.com/rrb-gt-tests/

Comments are closed.