OMR షీట్స్ బబ్లింగ్ వివాదంపై హైకోర్టు తీర్పు

OMR షీట్స్ బబ్లింగ్ వివాదంపై హైకోర్టు తీర్పు

TSPSC ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్ వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. వివిధ ఉద్యోగ నియామకాల సందర్భంగా జరిగిన ప్రవేశ పరీక్షల్లో OMR పత్రాల్లో బబ్లింగ్ లో పొరపాట్లపై హైకోర్టు విచారణ జరిగింది. బబ్లింగ్ లో తప్పులున్న సమాధాన పత్రాలను అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. బబ్లింగ్ లో తప్పులు చేసిన వారి OMR షీట్లు మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదన్నది. OMRలో వివరాలు జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టులో కేసుల కారణంగా ఆగిన నియామకాలు చేపట్టాలని TSPSCకి ఆదేశాలిచ్చింది. 40 నుంచి 60 పోస్టులు దాకా భర్తీ కాకుండా మిగిలిపోయాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు TSPSC న్యాయవాది బాలకిషన్ రావు. మిగిలిన పోస్టుల భర్తీ నియామకానికి చర్యలు చేపట్టేందుకు TSPSC హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో గ్రూప్ 2 ప్రవేశ పరీక్షలో కొందరు అభ్యర్థులు OMR షీట్లపై వైట్నర్ పెట్టడం వివాదస్పదమైంది. అభ్యర్థులు తెలియక చేశామని వాదించగా... ఇన్విజిలేటర్లు కూడా అవగాహన లేకుండా అనుమతించారని TSPSC వాదించింది. దీనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టు తీర్పుతో సద్దుమణిగింది.