Monday, December 17

మొబైల్స్ కి అనుమతి లేదు

చాలామంది ఓట్లేశాక... పోలింగ్ బూత్ దగ్గర ఫోటోలు దిగుదామనుకుంటున్నారు.

కొందరు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకుంటున్నారు.

మరి కొందరు ఓటు వేస్తూ ఫోటో దిగాలనీ...

ఇంకొందరు వీవీ ప్యాట్ లో తన ఓటును పిక్ తీసుకోవాలని అనుకుంటున్నారు.

నో ... అలాంటేవేమీ కుదరదు అంటోంది ఎలక్షన్ కమిషన్ పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించేది లేదని అంటోంది.

No Electronic Recording

Devices are Allowed

అంటూ ఇప్పటికే చాలా పోలింగ్ బూతుల్లో స్టిక్కర్లు కూడా అంటించారు. దీనిపై పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందాయి. దాంతో పోలీసులు ముందుగానే మొబైల్స్ తీసుకురావొద్దని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ని పోలింగ్ బూత్ ల్లోకి తీసుకెళ్ళనీయబోమని చెబుతున్నారు.

సో... ఓట్లు వేసే 7వ తారీఖునాడు మొబైల్స్ ఇంట్లో పెట్టి రావడం బెటర్.