నిజాం సబ్జెక్ట్ లీగ్

1) 1933లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెల్లడించిన ఫర్మానా ఉద్దేశ్యం ఏంటి ?
జ: ఉద్యోగాల్లో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వడం. నాన్ ముల్కీలను తాత్కాలిక ప్రాతిపదికన నియామకం.
2) ముల్కీల హక్కులు కాపాడటానికి ఏర్పడిన ప్రజా సంస్థ ఏది ?
జ: 1934లో నిజాం ప్రజల సంఘం (నిజాం సబ్జెక్ట్స్ లీగ్)
3) నిజాం ప్రజల సంఘంను ఉర్దూలో ఏమంటారు ?
జ: జమీయత్ రిఫాయామే నిజాం (అధ్యక్షుడు : నవాబ్ సర్ నిజామత్ జంగ్)
4) ముల్కీలీగ్ ఏ భాషను ప్రోత్సహించాలని కోరింది ?
జ: హిందీ (హిందూస్థానీని)
5) నిజాం ముల్కీ లీగ్ ఏమని నినాదం ఇచ్చింది ?
జ: హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్
6) ముల్కీలీగ్ నుంచి చీలిపోయి హిందువులు ఏ సంస్థను స్థాపించారు ?
జ: పీపుల్స్ కన్వెన్షన్
7) హైదరాబాద్ స్టేట్ లో రాజకీయ సంస్కరణలు తెచ్చేందుకు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరి అధ్యక్షతన రాజకీయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు ?
జ: దివాన్ బహుదూర్ అరవమూడి అయ్యంగార్ (ఛైర్మన్ గా)
8) ముల్కీ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉద్యోగుల నియామకంపై సూచనలు చేసిన కమిటీ ?
జ: అరవముడి అయ్యంగార్ కమిటీ
9) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది?దాన్ని నిజాం సర్కార్ ఎప్పుడు నిషేధించింది ?
జ: 1938 జులైలో ... నిషేధించింది : 1938 సెప్టెంబర్ 7న
10) నిజాం ప్రభుత్వం నిషేధించినా... వందేమాతరం ఉద్యమం ఎక్కడ నిర్వహించారు ?
జ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
11) వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన విద్యార్థులు ఎవరు ?
జ: పివి నర్సింహారావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాధం
12) బహిష్కృతులైన విద్యార్థులను చేర్చుకోడానికి ఏ యూనివర్సిటీ వాళ్ళు తిరస్కరించారు ?
జ: ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ కట్టమంచి రామలింగారెడ్డి