Thursday, March 21

నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి

రాష్ట్రంలో రాబోయే నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరుద్యోగ భృతి పథకం అమలు కోసం విధి విధానాలను స్టడీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ నిరుద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. అభ్యర్థుల కటాఫ్ వయస్సు ప్రభుత్వం తెలుసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ భృతిపై వెనక్కి తగ్గేది లేదనీ... అబద్దాలు చెప్పదలచుకోలేదన్నారు ముఖ్యమంత్రి. నాలుగైదు నెలల్లో ఈ పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నెలకు రూ.3016 ల చొప్పున నిరుద్యగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకోసనం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1810 కోట్లు కూడా కేటాయించారు. ఏ వయస్సు నుంచి ఏ వయస్సు మధ్యలోపు ఇవ్వాలి... విద్యార్హతలు, ఇతర విధి విధానాలను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో స్టడీ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పథకాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తారు.