Monday, October 26

BREAKING: NEET, JEE పరీక్షలు సెప్టెంబర్ కు వాయిదా

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో NEET, JEE పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. Joint Entrance Examination(JEE) మెయిన్, National Eligibility-cum-Entrance Test ( NEET 2020) పరీక్షలను సెప్టెంబర్ 2020 లో నిర్వహిస్తామని తెలిపారు. JEE Advanced ను కూడా వాయిదా వేశారు.

JEE మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను 2020 సెప్టెంబర్ 1 నుంచి 6 వరకూ JEE Advanced ఎగ్జామ్ ను సెప్టెంబర్ 27 న నిర్వహిస్తారు.

అలాగే NEET ఎగ్జామ్ ను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో రెండు సార్లు ఈ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి.

దేశంలో కోవిడ్ 19 అంతకంతకూ పెరిగిపోతున్నందున విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ వాయిదా వేసినట్టు మంత్రి తెలిపారు.