Thursday, December 13

మీ ఇంజనీరింగ్ కాలేజీకి NBA స్టాంప్ ఉందా ? అది లేకపోతే మీకు విదేశీ ఉద్యోగం రానట్టే !

ఇంజనీరింగ్ కాలేజీలు తప్పనిసరిగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) కలిగి ఉండాలట.  లేకపోతే భారతీయ ఇంజనీర్లకి ఇక దేశాల్లో ఉద్యోగాలు వచ్చే ఛాన్సే లేదంటున్నారు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అధికారులు.  NBA లేని ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ ను ఇకపై విదేశాల్లో అనుమతించడం లేదు. వాళ్ళ డిగ్రీలు చెల్లవు. అంతేకాదు వాళ్ళకి వర్క్ పర్మిట్ కూడా దొరకదు. దేశంలోనే 10 నుంచి 15శాతం టెక్నికల్ విద్యా సంస్థలు మాత్రమే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కలిగి ఉన్నట్టు AICTE ఛైర్మన్ అనిల్ ది సహస్రబుద్దే చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా NBA కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది.  ఈ NBA లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండవని AICTE ఛైర్మన్ తెలిపారు.  ఇప్పటికే కువైట్ ప్రభుత్వం తమ దగ్గర పనిచేసే  ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఈ విషయం తేల్చి చెప్పింది. Non-NBA అక్రిడేటెడ్ కాలేజీల నుంచి డిగ్రీలు పొందిన వారికి ఆ దేశంలో ఇబ్బందులు తప్పేలా లేవు.  ఇతర దేశాలు కూడా ఇదే పద్దతిని అనుసరించే అవకాశాలున్నాయి.

తెలంగాణలో మొత్తం 184 ఇంజనీరియంగ్ కాలేజీలు ఉండగా వీటిల్లో 40 నుంచి 45 కాలేజీలు మాత్రమే NBA అక్రిడిటేషన్ కలిగి ఉన్నాయి.  చాలా కాలేజీలు NBA ఎంత ఇంపార్టెంటో తెలియడం లేదంటున్నారు.  ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు లేని ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి.  దాంతో అవి NBA కి అప్లయ్ చేసుకోవడం లేదు.  NBA అక్రిడిటేషన్ కలిగిన కాలేజీల్లో ఫ్యాకల్టీలు రీసెర్చ్ తో పాటు టీచింగ్ లోనూ ఎంతో ప్రావీణ్యులు ఉంటారు.  వారి రికార్డులను కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంటారు.

NBA కి అనుగుణంగా ప్రమాణాలను పాటించడం అనేది సాధ్యం కాదని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కమిటీలు ఉండటంతో విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయలేకపోతున్నాయి.  ఈ పరిస్థితుల్లో NBA ప్రకారం ప్రమాణాలు పాటించడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటున్నాయి.   ఇంజనీరింగ్ కాలేజీలకు నిబంధనలను AICTE విధిస్తే, ఫీజుల వసూళ్లను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయని అంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు. AICTE నిబంధలను ఖచ్చితంగా పాటించాలంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నాయి.  ప్రస్తుతం కేవలం రూ.35 వేలు మాత్రమే విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నట్టు చెబుతున్నాయి.

విద్యా నిపుణులు మాత్రం ఇప్పటికిప్పుడు NBA లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదంటున్నారు. అయితే భవిష్యత్తుల్లో Non-NBA స్టూడెంట్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు దొరకడం కష్టమని చెబుతున్నారు.

విద్య, ఉద్యోగ సమాచారం... లేటెస్ట్ ట్రెండ్స్ కోసం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి:

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams