Thursday, October 1

త్వరలో 2298 మున్సిపల్ వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ, మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి తుది నిర్ణయం !

రాష్ట్రంలో త్వరలో మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకి ఒక అధికారి చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లు తరహాలో మున్సిపాలిటీల్లో వార్డుకి ఒక వార్డు ఆఫీసర్ ని నియమించాలని భావిస్తోంది. ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్ల నియమించాలని నిర్ణయించారు.  రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తుది నిర్ణయం తీసుకున్నారు. ఖాళీల భర్తీ ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకు పోతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పౌరుడే కేంద్రంగా పౌర సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, పట్టణాల అభివృద్ధికి ఖాళీల భర్తీ దోహదం చేస్తుందని అన్నారు. కొత్త పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వీలవుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

మొత్తం 6 వేలకి పైగా పోస్టులు ?

తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019 ప్రకారం రాష్ట్రంలో మొత్తం 158 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 2,298 వార్డులు ఉన్నాయి. గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం వార్డు ఆఫీసర్లను భర్తీ చేస్తే మొత్తం 2,298 ఖాళీలు భర్తీ అవుతాయి. అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో పాటు పాతవి, పంచాయతీల నుంచి అప్ గ్రేడ్ అయిన మున్సిపాలిటీల్లో దాదాపు 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలోనే ఈ విషయం www.telanganaexams.com ద్వారా మీకు తెలియజేశాం.
ఇప్పుడు వార్డ్ ఆఫీసర్లతో పాటు ఇతర మున్సిపల్ పోస్టులు భర్తీ చేస్తే.. మొత్తం 6 వేలకు పైగా పోస్టులకి నోటిఫికేషన్ వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఖాళీల భర్తీని TSPSC కి అప్పగిస్తారా... లేదంటే గతంలో పంచాయతీ కార్యదర్శులను డిపార్ట్ మెంట్ తో భర్తీ చేసినట్టే... మున్సిపల్ శాఖకి బాధ్యతలు ఇస్తారా... అన్న దానిపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.

మున్సిపాలిటీల్లో మొత్తం ఖాళీలు 3000 (Click here..more details)

తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ లింక్ (Click here)

గతంలో 558 పోస్టులు ప్రకటించినప్పుడు తయారు చేసిన వీడియో చూడండి (పోస్టులు, అర్హతల వివరాలు)