Monday, March 30

మున్సిపల్ పోస్టులకు విద్యార్హతలు, ఎగ్జామ్స్ విధానం !

ఈ పోస్టులకు అర్హతలు ఏంటి... తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందో వివరిస్తాను.

ముందుగా ఏజ్ రిలాక్సేషన్ గురించి చెబుతాను... మున్సిపాలిటీల్లో భర్తీ చేసే 3 వేల పోస్టులకు కూడా అభ్యర్థుల వయస్సు 44 వరకూ ఉంటుంది... సాధారణంగా 34 యేళ్ళకే అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది.  తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడటం... గత ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ సరిగా చేయకపోవడంతో... 34 నుంచి 10యేళ్ళ పాటు అంటే 44 యేళ్ళ వరకూ అప్లయ్ చేసుకోడానికి ప్రభుత్వం అర్హత కల్పించింది.  దీనికి సంబంధించి గతంలో జీవో కూడా రిలీజ్ చేసింది... సాధారణంగా జులై ఫస్ట్ కి కటాఫ్ ఉంటుంది.

మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన పోస్టు మున్సిపల్ కమిషనర్...

ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీలు కాబట్టి... గ్రేడ్ 3 కింద వీటిని పరిగణిస్తారు.  ఒక్కో మున్సిపాలిటీలో వివిధ విభాగాల కింద ఏడుగురు ఉంటారు. వీటిని గ్రూప్ 2 కింద భర్తీ చేస్తారు.

వీటికి అర్హత డిగ్రీ...

గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను.... గ్రూప్ 2 లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి...  675 మార్కులు ఉంటాయి...

వీటిల్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇది... 150 ప్రశ్నలు.... 150 మార్కులు... రెండున్నర గంటల టైమ్ ఉంటుంది..

పేపర్ 2 లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటాయి... ఇది కూడా... 150 ప్రశ్నలు.... 150 మార్కులు... రెండున్నర గంటల టైమ్ ఉంటుంది..

పేపర్ 3 లో ఎకానమీ అండ్ డెవలప్ మెంట్... ఇది... 150 ప్రశ్నలు.... 150 మార్కులు... రెండున్నర గంటల టైమ్ ఉంటుంది..

పేపర్ 4 కి వచ్చే సరికి... తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ... ఇందులో కూడా ... 150 ప్రశ్నలు.... 150 మార్కులు... రెండున్నర గంటల టైమ్ ఉంటుంది..

వీటిల్లో మెరిట్ పొందిన వారికి 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు... ఇంటర్వూలో 75 మార్కులు ఉంటాయి.

టోటల్ గా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులకు 675 మార్కులకు ... గ్రూప్ 2 మోడల్ లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.

మున్సిపల్ కమిషనర్ పోస్టులను గ్రూప్ 2 కేడర్ కింద భర్తీ చేస్తే ఈ సిలబస్ ఉంటుంది. TSPSC ద్వారా కాకుండా... ప్రత్యేకంగా రిక్రూట్ మెంట్ చేపడితే... అప్పటి సిలబస్ కి అనుగుణంగా ఎగ్జామ్ ఉండవచ్చు. మార్పులు, చేర్పులు ఉండొచ్చు.

Also Read : త్వరలో మున్సిపల్ శాఖలో 3 వేల ఉద్యోగాల భర్తీ

మున్సిపల్ పోస్టుల్లో రెండోది అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 3...

సాధారణంగా మున్సిపాలిటీల్లో  అసిస్టెంట్ ఇంజనీర్లు... సివిల్ లేదా మెకానికల్ పోస్టులు ఉంటాయి.  దీనికి అర్హత బీటెక్ సివిల్ లేదా మెకానికల్ ఉంటుంది.

ఈ పోస్టులకు రెండు పేపర్లు ఉంటాయి.  ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు 150 ప్రశ్నలు .. రెండున్నర గంటలు...

సెకండ్ పేపర్ సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లోమా లెవల్ ఎగ్జామ్ ఉంటుంది.  150 మార్కులు, 150 ప్రశ్నలు రెండున్నర గంటల టైమ్ ఉంటుంది.

 

ఇక మున్సిపాలిటీల్లో భర్తీ చేయబోయే మూడో పోస్టు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వర్.

వీటికి అర్హత బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ... బిటెక్ సివిల్ లేదా బిటెక్ ప్లానింగ్ ... ఇది కూడా రెండు పేపర్లుగా ఎగ్జామ్ ఉంటుంది... ఒకటి జనరల్ స్టడీస్, రెండో పేపర్ సబ్జెక్ట్ మీద డిప్లొమా లెవల్ లో ఎగ్జామ్ ఉంటుంది.

 

ఇక మున్సిపాలిటీలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.

దీనికి అర్హత బికాం డిగ్రీ ఉంటుంది

దీనికి గ్రూప్ 4 లెవల్ ఎగ్జామ్ ఉంటుంది... 150 మార్కులు జనరల్ నాలెడ్జ్, 150 మార్కులకు సెక్రటరియేట్ ఎబిలిటీస్ ఉంటాయి. ఒక్కో ఎగ్జామ్ రెండున్నర గంటలు. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్...

Also Read : 1900 పోస్టులకు త్వరలో గురుకుల్ నోటిఫికేషన్

 మున్సిపాలిటీల్లో హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి.

వీటికి అర్హత ఇంటర్మీడియట్. తో పాటు Health Assistant Training course or Sanitary Inspector Training course  అవసరం. దీనికి ఎగ్జామ్  జనరల్ నాలెడ్జ్ మరియు బయోలాజికల్ సైన్స్ (ఇంటర్ లెవల్ ) 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది...

మున్సిపాలిటీల్లో భర్తీ చేయబోయే పోస్టుల్లో ... బిల్ కలెక్టర్లు కూడా ఉన్నాయి.

వీటికి  ఏదైనా డిగ్రీ సరిపోతుంది.

ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే...  జనరల్ నాలెడ్జ్ లో 150 ప్రశ్నలు, 150 మార్కులు రెండున్నర గంటల టైమ్ ఉంటుంది...

రెండో పేపర్  సెక్రటరియేట్ ఎబిలిటీస్ మీద ఉంటుంది... ఇందులో 150 ప్రశ్నలు 150  మార్కులు ఉంటాయి...

నేను ముందు నుంచీ చెబుతున్నట్టుగా... మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉండండి... లాంగ్ టైమ్ ప్రిపరేషన్ లో ఉండటం వల్ల ... ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా మీరు విజయం సాధిస్తారు...

మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో కరెంట్ ఎఫైర్స్, జీకే తో పాటు చాలా ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి... అలాగే మీరు యూట్యూబ్ క్లాసులను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి..  దయచేసి... మన యూట్యూబ్ ఛానెల్ లింక్ ను మీ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, మెయిల్ ఇలా సోషల్ మీడియాలో మీ తరపున షేర్ చేయండి...

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests (Last Date : 20th Feb 2020)
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court, Muncipal Jobs Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.