Saturday, August 15

మున్సిపల్ ఖాళీలపై మంత్రి KTR సమీక్ష, అవసరమైన పోస్టులు గుర్తించాలని ఆదేశాలు

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అంశంపై మంత్రి KTR ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆ తర్వాత ఎంతమంది అవసరం అవుతారో గుర్తించి కొత్త సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇందులో ఇంజనీరింగ్, మౌలిక సదుపాలయ విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఖాళీల భర్తీలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాల్లోని మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోనూ సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుందనీ అందుకోసం ప్లానింగ్ రెడీ చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శ అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు మంత్రి కేటీఆర్.

మున్సిపాలిటీల్లో మొత్తం ఖాళీలు 3000 (Click here..more details)

(నోట్: మున్సిపల్ పోస్టులకు సంబంధించి గతంలో ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం మొత్తం 3 వేల దాకా ఖాళీలు ఉన్నాయి. వీటిని కాంటాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ తో కాకుండా... డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నోటిఫికేషన్ రావడానికి ఇంకా కొంత టైమ్ పడుతుంది. ఆ సమాచారం ఎప్పుడు వచ్చినా మీకు షేర్ చేస్తాను. తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. లింక్ కింద ఇస్తున్నాను. మున్సిపల్ పోస్టలకు సంబంధించి పోస్టులు ఏవేమి ఉండొచ్చు... వాటికి అర్హతలు, ఎగ్జామ్ సిలబస్ విశ్లేషణపై లేటెస్ట్ వీడియో మీకు Telangana Exams youtube channel ద్వారా జులై 15నాడు అందిస్తాను.  వెంటనే ఈ కింది లింక్ ద్వారా ఛానెల్ ను subscribe చేసుకోండి. నిరుద్యోగులు ప్రిపరేషన్ లో ఉండగలరని మనవి. (విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్ )

 తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ లింక్ (Click here)

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి:

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en

గతంలో 558 పోస్టులు ప్రకటించినప్పుడు తయారు చేసిన వీడియో చూడండి