Saturday, August 15

త్వరలో మున్సిపల్ ఖాళీల భర్తీ : మంత్రి KTR

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. మున్సిపాలిటీల సమీక్ష కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి:

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en

ఈసారైనా భర్తీ ఉంటుందా ?

మున్సిపల్ పోస్టుల భర్తీ గురించి ఎప్పటికప్పుడు మీడియాకి లీకులు రావడం, వాటిని ప్రచురించడం కామన్ గా మారింది. అయితే పోస్టుల భర్తీపై ఈసారి మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేపట్టకపోవడంతో నిరుద్యోగులు చాలా నిరాశలో ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనతో నిరుద్యోగులు మరింత నిరుత్సాహానికి గురయ్యారు. ఉద్యోగాల భర్తీ పేరుతో ప్రతిపక్షాలు నిరుద్యోగులను మభ్య పెడుతున్నాయని అప్పట్లో చెప్పారు. దాంతో తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావడం కష్టమేనని నిరుద్యోగులు డిసైడ్ అయ్యారు. అయితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా లక్షల్లో కొలువులు భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగుల్లో మరింత నైరాశ్యం నింపింది. నిజానికి తెలంగాణ ఏర్పడిందే... నీళ్ళు, నిధులు, నియామకాల కోసం... మరి ఈ నియామకాల సంగతిని TRS సర్కార్ అంతగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. TSPSC, POLICE, విద్యుత్ సంస్థల ద్వారా కొంత వరకూ పోస్టుల భర్తీ చేపట్టినప్పటికీ... అవి వేలల్లోనే ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. పైగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యతో పోలిస్తే భర్తీ చేసిన ఉద్యోగాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి.

3వేల పోస్టుల భర్తీపై గతంలో తెలంగాణ ఎగ్జామ్స్ ఇచ్చిన యూట్యూబ్ వీడియో చూడండి (అర్హతలు, ప్రిపరేషన్ విధానం లాంటి అంశాలు వివరించాం)
https://www.youtube.com/watch?v=cbmOl1BZxsA

మున్సిపల్ శాఖలో ఖాళీలు 3000

అసలు మున్సిపల్ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది ఓసారి చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా మున్సిపాలిటీలో ఏర్పడటంతో ఆ శాఖలో దాదాపు 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పోరేషన్లతో పాటు పాత మున్సిపాలిటీల్లోని ఖాళీలను కూడా కలుపుకొని మొత్తం 3 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 40వేల జనాభా గల మున్సిపాలిటీల్లో 36 పోస్టులు అవసరం అవుతాయి. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ముగ్గురు లేదంటే నలుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి తోడు, ఈ వర్షాకాలంలో సీజనల్ ఫీవర్స్ రాకుండా మున్సిపాలిటీల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో... చాలా మున్సిపాలిటీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.  చాలా మున్సిపాలిటీలకు మండల MPDO లో మున్సిపల్ కమిషనర్లుగా ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   దాంతో స్థానిక ప్రజా ప్రతినిధులు సిబ్బంది సంఖ్య పెంచాలని ఎప్పటి నుంచో మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేసుకోండి : https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?view_as=subscriber

ఏ పోస్టులు ఉంటాయి ?

CDMA పరిధిలో 128 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్ల పోస్టులతో పాటు మినిస్టీరియల్ స్టాఫ్ కూడా అవసరం అవుతుంది. కొత్త మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో 100 అసిస్టెంట్స్ ఇంజనీర్ పోస్టులు ఉన్నట్టు అంచనా. వీటితో పాటు జూనియర్ అసిస్టెంట్స్, బిల్ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ పోస్టులు ఉండే అవకాశముంది. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో పాటు ...కొన్ని టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులు కూడా ఉండటంతో... ITI, పాలిటెక్నిక్ వారికి కూడా అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి... వీటి భర్తీ TSPSC కి అప్పగిస్తారా... లేదా మున్సిపల్ శాఖనే రిక్రూట్ చేస్తుందా అన్నది నోటిఫికేషన్ వస్తే గానీ తెలియదు.

3వేల పోస్టుల భర్తీపై గతంలో తెలంగాణ ఎగ్జామ్స్ ఇచ్చిన యూట్యూబ్ వీడియో చూడండి (అర్హతలు, ప్రిపరేషన్ విధానం లాంటి అంశాలు వివరించాం)
https://www.youtube.com/watch?v=cbmOl1BZxsA