ముదిగొండ చాళుక్యులు

1) ముదిగొండ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు?
జ: రణ మర్ధుడు
2) ముదిగొండ చాళుక్యుల పతనాన్ని వివరిస్తున్న శాసనం ఏది?
జ: పాలంపేట శాసనం
3) ముదిగొండ చాళుక్యుల రాజ చిహ్నం ఏది?
జ: కంఠిక హారం
4) వినీత జనాశ్రయుడు అనే బిరుదు గల ముదిగొండ చాళుక్యరాజు ఎవరు?
జ:రెండో కుసుమాయుదుడు
5) ముదిగొండ చాళిక్యుల రాజధాని ఏది ?
జ: ఖమ్మం పట్టణం సమీపంలోని ముదిగొండ
6) ముదిగొండ కొరవి సీమలో ఉండేది. అయితే కొరవి సీమకు మరో పేరు ఏంటి ?
జ: విసరునాడు
7) తూర్పు చాళుక్య, రాష్ట్ర కూట యుద్ధాల్లో పాల్గొన్న ముదిగొండ చాళిక్యుల రాజు ఎవరు ?
జ: కుసుమాయుధుడు
8) ముదిగొండ చాళుక్యుల్లో చివరి వాడు ఎవరు ?
జ: కుసుమాదిత్యుడు
9) ముదిగొండ చాళుక్యుల రాజ్యం ఏ సామ్రాజ్యంలో కలిసిపోయింది ?
జ: కాకతీయ సామ్రాజ్యంలో