Saturday, August 17

మోడీ టీమ్ – పోర్ట్ ఫోలియోలు

భారత ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తన కేబినెట్ కి పోర్ట్ ఫోలియోలు ప్రకటించారు. ప్రధానితో కలసి మొత్తం 58 మంది ఉండగా వీళ్ళల్లో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర  హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈసారి మంత్రి వర్గంలో 20 మంది కొత్త వారు జాయిన్ అయ్యారు.

కేబినెట్ హోదా

1) నరేంద్ర మోడీ, ప్రజా వినతులు, ఫించన్లు, ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ విభాగాలు, మంత్రులెవరికీ కేటాయించని శాఖలు
2) రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ
3) అమిత్ షా, హోంశాఖ
4) నితిన్ గడ్కరీ, రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
5) సదానంద్ గౌడ, రసాయన, ఎరువుల శాఖ
6) నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ
7) రాం విలాస్ పాశ్వాన్, వినయోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సంబంధాలు
8) నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
9) రవిశంకర్ ప్రసాద్, న్యాయ, సమాచార, ఐటీ శాఖ
10) హరి సిమ్రత్ కౌర్ బాదల్. ఆహార శుద్ధి పరిశ్రమ
11) థావర్ చంద్ గెహ్లాట్, సామాజిక న్యాయం, సాధికారత
12) డాక్టర్ సుబ్రహ్మణ్య జయశంకర్, విదేశాంగ శాఖ
13) రమేష్ పోఖ్రియాల్, మానవ వనరుల అభివృద్ధి శాఖ
14) అర్జున్ ముండా, గిరిజన సంక్షేమం
15) స్మృతి ఇరానీ, స్త్రీ శిశు సంక్షేమం, జౌళి శాఖ
16) హర్షవర్ధన్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
17) ప్రకాశ్ జవ్ డేకర్, పర్యావరణం, అటవీ శాఖ, సమాచార, ప్రసార శాఖ
18) పీయూష్ గోయల్. రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ
19) ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమలు
20) ముక్తార్ అబ్బాస్ నక్వీ, మైనార్టీ వ్యవహారాలు
21) ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
22) మహేంద్ర నాథ్ పాండే, నైపుణ్యాభివృద్ధి శాఖ
23) అర్వింద్ గణపత్ సావంత్, భారీ పరిశ్రమలు
24) గిరి రాజ్ సింగ్, పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్
25) గజేంద్ర సింగ్ షెకావత్, జలశక్తి

స్వతంత్ర హోదా

26) సంతోష్ కుమార్ గంగ్వార్, శ్రామిక, ఉపాధికల్పన శాఖ
27) రావ్ ఇంద్రజిత్ సింగ్, ప్రణాళిక, గణాంక శాఖ
28) శ్రీపాద్ యశో నాయక్, ఆయుష్, రక్షణ శాఖ
29) డాక్టర్ జితేంద్ర సింగ్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి, PMO సహాయ మంత్రి
30) కిరణ్ రిజుజూ, క్రీడలు, యువజన, మైనార్టీ వ్యవహారాలు
31) ప్రహ్లాద్ సింగ్ పటేల్, సాంస్కృతిక పర్యాటక శాఖ
32) రాజ్ కుమార్ సింగ్, విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
33) హర్దీప్ సింగ్ పూరి, గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
34) మన్సుక్ లక్ష్మణ్ భాయ్ మాండవ్యా, షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు

సహాయ హోదా

35) ఫగ్గత్ సింగ్ కులస్థే, ఉక్కు శాఖ
36) అశ్వినీ కుమార్ చౌబే, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
37) అర్జున్ రామ్ మేఘవాల్, పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
38) వీకే సింగ్, రహదారులు, రవాణా శాఖ
39) కిషన్ పాల్ గుజ్జర్, సామాజిక న్యాయం, సాధికారత
40) రావు సాహేబ్ ధాన్వే - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
41) కిషన్ రెడ్డి, హోంశాఖ
42) పురుషోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం
43) రాందాస్ అథవాలే - సాంఘిక న్యాయం, సాధికారత
44) సాధ్వి నిరంజన్ జ్యోతి - గ్రామీణాభివృద్ధి
45) బాబుల్ సుప్రియో , అటవీ పర్యవారణ శాఖ
46) సంజీవ్ కుమార్ బల్యాన్ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్
47) సంజయ్ ధోత్రే, మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీ శాఖ
48) అనురాగ్ ఠాకూర్ - ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
49) సురేశ్ చిన బసప్ప - రైల్వేశాఖ
50) రతన్ లాల్ కఠారియా - నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత
51) మురళీధరన్, పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు
52) రేణుకా సింఘ సరూటా - గిరిజన వ్యవహారాలు
53) సోంప్రకాశ్ - పరిశ్రమలు, వాణిజ్యం
54) రామేశ్వర్ తేలి, ఆహార శుద్ధి పరిశ్రమలు
55) ప్రతాప్ చంద్ర సారంగి - మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ
56) కైలాష్ చౌదరి - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
57) దేబశ్రీ చౌదరి, మహిళా శిశు సంక్షేమ శాఖ
58) నిత్యానంద్ రాయ్, హోంశాఖ