Thursday, August 22

మంత్రులకు శాఖల కేటాయింపు

రాష్ట్రంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన పది మంది మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు.

1) జగదీష్ రెడ్డి - విద్యా శాఖ

2) తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశుసంవర్థక శాఖ

3) నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ

4) ఎర్రబెల్లి దయాకర్ రావు - పంచాయతీ రాజ్ శాఖ

5) ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్య శాఖ

6) కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖ

7) ఇంద్రకరణ్ రెడ్డి - అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ

8) సీహెచ్ మల్లారెడ్డి - కార్మిక శాఖ

9) శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్, క్రీడలు, టూరిజం, యువజన సర్వీసులు

10) వేముల ప్రశాంత్ రెడ్డి - రోడ్లు, భవనాలు, రవాణా శాఖ

కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, ఐటీ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం కేసీఆర్.  మహమూద్ అలీకి ఇప్పటికే హోంశాఖ ను కేటాయించారు.