Monday, November 12
Log In

ఆ సీట్లో కూర్చుంటే జరిమానా!

మీరు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా... అయితే జాగ్రత్త. మెట్రోలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్న మగవాళ్ళకు భారీ జరిమానా తప్పదు. రూ.500 ఫైన్ వసూలు చేయడానికి మెట్రో అధికారులు ప్రత్యేక టీమ్ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మెట్రో రైల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన సీట్లల్లో ఇతరులు ఎవరూ కూర్చోడానికి వీల్లేదంటున్నారు మెట్రో MD ఎన్వీఎస్ రెడ్డి. ప్రతి మెట్రో బోగీలో L & T సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసుల నిఘా కూడా పెడుతున్నారు. మహిళలు తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని వివరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ కూడా కేటాయించబోతున్నారు. సో... మెట్రో లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.