Thursday, May 28

నిరుద్యోగులకు శుభవార్త ! MADE లో డిజిటల్ కన్సల్టెంట్స్ (Part time/Full time)

Masters Academy for Digital Education (MADE) (Telangana & Andhra Exams Websites/apps) ద్వారా మీరు పార్ట్ టైమ్ గా (కమీషన్ బేస్డ్ ) లో ఆదాయం సంపాదించుకునే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని 10 జిల్లాల అభ్యర్థుల నుంచి Digital Consultants కోసం దరఖాస్తులు కోరుతున్నాం. మా MACF ప్రాజెక్టులో మీరు పార్ట్ టైమర్ గా పనిచేసే అవకాశం కల్పిస్తాం. అందుకోసం మీరు పైసా కూడా MADEకి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి ఎలాంటి డిపాజిట్స్ తీసుకోము..

MACF అంటే ఏంటి ?

 • Masters Academy for Civils Foundation. ఇందులో 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సివిల్స్ తో పాటు ఇతర సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మెటీరియల్, ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయిస్తాం.
 • ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మాత్రమే ఈ నోట్స్, ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. తెలుగు మీడియం వాళ్ళకి లేదు.
 • ఏడాది పొడవునా - ఏయే తరగతుల విద్యార్థులకు ఆయా క్లాసులతో పాటు ఆ తర్వాత చదవబోయే క్లాసులకు సంబంధించిన నోట్స్ అందిస్తాం. దాంతో ఇటు అకడమిక్ గా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోడానికీ... అటు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఈ నోట్స్ ఉపయోగపడుతుంది.
 • నోట్స్ తో పాటు ప్రతి వారం ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ప్రతి వారంలో మంగళవారంతో పాటు... క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.
 • నోట్స్, ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్ లైన్ లోనే ఉంటాయి. Offline లో ఎలాంటి మెటీరియల్ ఇవ్వబడదు. మన దగ్గర subscribe చేసుకున్న విద్యార్థులు Telangana/Andhra Exams Website/ Android app ద్వారా లాగిన్ అయితే నోట్స్, టెస్టులు ఓపెన్ అవుతాయి.
 • స్కూల్స్ లేదా కాలేజీల్లో కంప్యూటర్స్ ఉంటే అక్కడే టెస్టులు రాయించే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళ ఇళ్ళల్లో/ పేరెంట్స్ మొబైల్స్ కూడా లాగిన్ అయి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

మనం కవర్ చేసే మెటీరియల్ (English Medium only)

1) NCERT

2) SCERT

మనం కవర్ చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్

1) Civil Services
2) UPSC
3) SSC
4) RRB
5) BANKS (RBI, IBPS, SBI)
6) LIC
7) INDIAN NAVY
8) INDIAN ARMY
9) AIR INDIA
10) TSPSC
11) APPSC
12) Police Jobs
13) Electricity Boards
14) Courts etc.,
( జనరల్ స్టడీస్ కు సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కి మన మెటీరియల్ ఉపయోగపడుతుంది)

ఏయే Subjects కవర్ చేస్తాం ?

1) CURRENT AFFAIRS ( International, National, Regional)
2) STATIC GK
2) PHYSICS
3) CHEMISTRY
4) BIOLOGY
5) SCIENCE AND TECHNOLOGY
6) GEOGRAPHY ( WORLD, INDIA & TELANGANA, AP)
7) POLITY, CONSTITUTION, ADMINISTRATION
8) ECONOMY ISSUES
9) WORLD & INDIAN HISTORY
10) TELANGANA HISTORY
11) ARTHAMETIC & REASONING
12) ENGLISH

ప్రశ్నలు ఎలా ఉంటాయి ?

(A) Concept based
(B) Logical type
(C) Statement Type
(D) Matching
(E) Diagrams, Pictures Identification

ఇవి కాకుండా

GUIDANCE :

• 10TH after Courses, Career - Experts guidance
• Inter after courses, Career – Experts guidance
• Degree after Courses, Career – Experts guidance

MACF తో  విద్యార్థులకు బెనిఫిట్ ఏంటి ?

 • ప్రతి విద్యార్థికీ భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా 6 th to 10th బుక్స్ స్టాండర్డ్ నాలెడ్జ్ కావాలి. మనం స్టేట్ తో పాటు NCERT (సెంట్రల్ సిలబస్ ) కూడా కవర్ చేస్తాం. దాంతో విద్యార్థుల Educational Standard Levels పెరుగుతాయి.
 • విద్యార్థులు తాము చదువుతున్న క్లాసులతో పాటు అంతకంటే హయ్యర్ క్లాసుల స్టాండర్డ్స్ ప్రశ్నలను కూడా ముందుగానే కవర్ చేస్తాం. (అంటే 6th Student కి 7th స్టాండర్డ్ కూడా కవర్ చేస్తాం )
 • విద్యార్థులను MACF లో చేర్చడం వల్ల అకడమిక్ ఎగ్జామ్స్ లో కూడా ఇంప్రూవ్ అవుతారు. దీంతో పాటు... భవిష్యత్తులో రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన నాలెడ్జ్ ని ముందే గెయిన్ చేయగలుగుతారు.
 • విద్యార్థులు ఇంటర్, డిగ్రీలు పూర్తి చేయగానే... తొందర్లోనే ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది.
 • డిగ్రీ తర్వాత కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్ లో ఉంటూ వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటూ... అంతకంటే ముఖ్యంగా విలువైన సమయాన్ని వృధా చేయకుండా మనం ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేయించడానికి అవకాశం ఉంటుంది.
 • మన ఎగ్జామ్స్ వాళ్ళకి Future Job Career తో పాటు... ప్రెజెంట్ లో వాళ్ళ అకడమిక్ ఎగ్జామ్స్ కీ, further education ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఉపయోగపడతాయి ( నవోదయ, సైనిక స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూళ్ళల్లో అడ్మిషన్ టెస్టులకూ యూజ్ అవుతాయి )
 • భవిష్యత్తులో యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు Experts ద్వారా గైడెన్స్ కూడా ఇప్పించబడును.

స్కూల్స్/కాలేజీలకు బెనిఫిట్స్

 • MACF ప్రవేశపెట్టేందుకు MADE సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న స్కూల్స్ లేదా కాలేజీలు తమ విద్యార్థులకు దీని బెనిఫిట్స్ వివరిస్తాయి
 • వచ్చే విద్యాసంవత్సరం కోసం మార్చి, ఏప్రిల్ నెలల నుంచే స్కూల్స్, కాలేజీలు క్యాంపెయిన్ చేస్తుంటాయి. మనతో ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటే తమ బ్రోచర్స్ లేదా క్యాంపెయిన్ మెటీరియల్ లో MACF ను mention చేస్తూ ప్రచారం చేసుకోవచ్చు.
 • MACF అందుబాటులో ఉన్న విద్యాసంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది.
 • అన్నింటికంటే ముఖ్యంగా MACF ని తమ విద్యార్థులకు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసిన వారు కూడా అవుతారు.
 • MADE తో అగ్రిమెంట్ చేసుకున్న స్కూల్స్, కాలేజీల వివరాలు Telangana Exams లో ప్రచురిస్తాం.
 • ఇంట్రెస్ట్ ఉన్న స్కూళ్ళు, కాలేజీలకు వాళ్ళ సంస్థల పేరు మీద వెబ్ సైట్ & APP కూడా క్రియేట్ చేసి ఇస్తాం.
 • భవిష్యత్తులో MADE ఏర్పాటు చేయబోయే యూట్యూబ్ ఛానెల్స్ లో ఆయా విద్యా సంస్థల కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తాం.

మీరేం చేయాలి ?

 • మీరు MADE సంస్థ తరపున Digital Consultant గా పనిచేయాలి...
 • మీ ఏరియా/జిల్లా/ రాష్ట్రపరిధిలోని స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి MACF వల్ల ప్రయోజనాలను వాళ్ళకి వివరించాలి.
 • ప్రతి స్కూల్ / కాలేజీకి వెళ్ళి యాజమాన్యాలను కలుసుకొని MACF ప్రయోజనాలను వాళ్ళకి చెప్పాలి.
 • అవసరమైతే స్కూళ్ళు / కాలేజీలను పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించమని చెప్పి... వాటిల్లో మన MACF ను వాళ్ళకి వివరించాలి.
 • MACF గురించి కాలేజీ యాజమాన్యాలకు వివరించేందుకు కావాల్సిన పూర్తి సమాచారం మీకు మేం అందిస్తాం.
 • MADE సంస్థతో మీరు మాట్లాడిన స్కూల్స్ లేదా కాలేజీలతో ఒప్పందం కుదిరి, MADE సంస్థ కరెంట్ అకౌంట్ కి అమౌంట్ అందిన వెంటనే మీ అకౌంట్ కి కమీషన్ ట్రాన్స్ ఫర్ చేయబడుతుంది.
 • కేవలం స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలనే కాకుండా, మీరు పేరెంట్స్ లేదా విద్యార్థులను కూడా నేరుగా (Individualగా) ఈ MACF కోర్సులో జాయిన్ చేయించవచ్చు.
 • MADE (తెలంగాణ/ఆంధ్ర ఎగ్జామ్స్ వెబ్ సైట్స్ ) తరపున Digital Consultant గా పనిచేసినందుకు మీకు ఎలాంటి శాలరీ ఇవ్వబడదు. పూర్తిగా కమీషన్ ఇవ్వగలం.
 • MACF నే కాకుండా... ఆయా స్కూల్స్, కాలేజీలుకు సపరేట్ గా వెబ్ సైట్ మరియు యాప్స్ కూడా (దీనికి విద్యాసంస్థల నుంచి సపరేట్ అమౌంట్ కలెక్ట్ చేయబడును) మన సంస్థ తరపున అందించగలం. ఇందులో కూడా మీకు కమీషన్ ఇవ్వబడును.
 • విద్యార్థులను వారి పేరెంట్స్ ని ఒప్పించి నేరుగా మన కోర్సులో చేర్పిస్తే... ప్రతి విద్యార్థి నుంచి వచ్చే ఫీజుల్లో కూడా మీకు కమీషన్ ఇవ్వబడును.
 • ఎంపికైన ప్రతి అభ్యర్థికి MADE సంస్థ తరపున Digital Consultant గా ఐడీ కార్డ్ ఇవ్వబడును.

ఇప్పుడేం చేయాలి ?

మీ ఏరియాలో స్కూళ్ళు లేదా కాలేజీలకు వెళ్ళి MACF గురించి విరించే సామర్థ్యం, సత్తా ఉందని మీరు భావిస్తే...ఇప్పుడే మీ వివరాలు పంపండి

1) రెజ్యూమ్ తో (బయోడేటా) పాటు మీ పేరు, మొబైల్ నెంబర్ (వాట్సాప్) గ్రామం, పట్టణం, మండలం, జిల్లా, పిన్ కోడ్ తో పాటు మీ మెయిల్ అడ్రెస్ వివరాలు ఇస్తూ... మీ రెజ్యూమ్స్ 703 6813 703 కి వాట్సాప్ ద్వారా పంపండి

2) అభ్యర్థులందరి రెజ్యూమ్స్ (బయోడేటా)లు పరిశీలించాక... మీకు మేమే ఫోన్ చేస్తాం. అంతవరకూ దయచేసి ఎవరూ కాల్ చేయొద్దు.

3) ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉండాలి. ( 10th చదివిన వారైనా... MACF గురించి చెప్పగలిగి ఉంటే ప్రాధాన్యత ఇస్తాం )

4) కంగారు లేకుండా సరిగా అర్థం చేసుకొని చొరవగా మాట్లాడగలగాలి.

5) నేను ఏదైనా సాధించగలను అన్న పట్టుదల కలిగి ఉండాలి.

6) వర్క్ మొత్తం కమీషన్ బేస్డ్ గా ఉంటుంది... ఎలాంటి జీతం ఇవ్వబడదు.

7) మేం పెట్టిన ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాకే... మీ బయోడేటా ఇతర వివరాలు వాట్సాప్ చేయండి... ముందు డిటైల్స్ పంపి... నేను అలా అనుకోలేదు... అంటూ కన్ఫ్యూజ్ గా మాట్లాడొద్దు.

8) ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ ఎలా అయినా మీరు పనిచేయొచ్చు. ఇందులో టార్గెట్స్ ఏమీ ఉండవు. కానీ మినిమం వర్క్ చేయగలిగి ఉండాలి. కష్టపడి పనిచేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. టాలెంట్ చూపిస్తే... భవిష్యత్తులో కూడా మీ సేవలను మేం ఉపయోగించుకుంటాం.

9) ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లయ్ చేయండి... మీది, మాది టైమ్ అనేది చాలా విలువైనది అని మాత్రం గ్రహించండి. (గతంలో కొందరు ఇబ్బంది పెట్టారు. అందుకే ..)

మీ ఎం. విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్
మేనేజింగ్ పార్టనర్ MADE, హైదరాబాద్