Monday, September 23

JUNE 2018 – CA – TOP -60 (2nd PART)

26) ప్రతిష్టాత్మక జపాన్ పురస్కారమైన నిక్కీ ఏసియా ప్రైజ్ ఏ భారతీయుడికి దక్కింది ?
జ: సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్
27) 32 రోజుల పాటు జరిగే ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ సంబరాలు ఎక్కడ మొదలయ్యాయి ?
జ: రష్యా లోని లుజ్నికి స్టేడియంలో
28) రాష్ట్రమంత్రి కేటీఆర్ ఓ స్వాతంత్ర్య సమరయోధుని ఆత్మకథ నా జ్ఞాపకాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అది ఎవరి ఆత్మకథ ?

జ: తెలంగాణ పోరాట సమరయోధుడు మిట్ట యాదవరెడ్డి
29) 36 నౌకలు
7) తేయాకు తోటల్లో వాడటానికే అనుమతి ఉన్న ఏ పురుగు మందును బీటీ-3 పత్తి విత్తనాల్లో వాడకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ?
జ: గ్లైఫొసేట్
30) భారత తీర గస్తీ దళ సేవలను 2023 నాటికి 200 నౌకలతో శక్తివంతం చేయనున్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఏ నౌకను ICG అదనపు డైరక్టర్ జనరల్ వి.ఎస్.ఆర్. మూర్తి ప్రారంభించారు ?
జ: రాణి రాష్మోణి
31) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు - 2018 కి ఎంపికైన రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు ?
జ: దీపికా రెడ్డి


32) దేశంలో ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల పరిస్థతులు బాగోలేకపోతే 356 ఆర్టికల్ కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ గవర్నర్ పాలన మాత్రమే విధించే రాష్ట్రం ఏది ?
జ: జమ్ము కశ్మీర్
33) అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచుల్లో 481 పరుగులు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన క్రికెట్ జట్టు ఏది ?
జ: ఇంగ్లండ్
(నోట్: నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు సృష్టించింది )
34) ఫోర్బ్స్ ప్రకటించిన అపర కుబేరుల జాబితాలో మొదటి స్థానం ఎవరికి దక్కింది ? (141.9బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9.5లక్షలన కోట్లు)
జ: జెఫ్ బెజోస్ ( అమెజాన్ వ్యవస్థాపకుడు )
35) మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాని అభివృద్ధి చేసిన IIT ఏది ?
జ: IIT ఖరగ్ పూర్
36) ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలకు సంబంధించి నియమ నిబంధలను పరిశీలించేందుకు IRDAI ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
జ: సురేష్ మాథూర్ కమిటీ
37) రిక్రియేషన్ కోసం మారిజూనా మత్తు మందు వాడకాన్ని న్యాయబద్ధం చేసిన G7 దేశం ఏది ?
జ: కెనడా
38) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కంపా నిధులు జారీ చేస్తుంది. కంపా పూర్తి పేరేంటి ?
జ: కాంపన్సెటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ
39) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి ఎవరు ?
జ: భావనా రెడ్డి
40) ఇంటర్నేషనల్ యోగా డే సందర్బంగా భారీ సంఖ్యలో యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన సిటీ ఏది?
జ: కోటా ( రాజస్థాన్ )
(నోట్: ఇక్కడ 60 వేల మంది యోగాసనాలు వేశారు )
41) స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా ఏ రాష్ట్ర రాజధానిని 100వ స్మార్ట్ సిటీగా గుర్తించారు ?
జ: షిల్లాంగ్ ( మేఘాలయ రాజధాని )
42) ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు ?
జ: అనుపమ్ ఖేర్
43) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కించుకున్న ఇద్దరు తెలుగు వారు ఎవరు ?
జ: నారంశెట్టి ఉమా మహేశ్వర్ రావు ( ఆనందలోకం కవితా సంపుటి)
బాల సుధాకర్ మౌళి (ఆకు కదలని చోటు కవితా సంపుటి )
44) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తునందుకు గాను రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డు అందిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది ?
జ: ది బెస్ట్ వెరిఫికేషన్ అవార్డు (2017-18)
45) 2018 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ?
జ: Yoga for Harmony and Peace
46) Sports Illustrated's Sportsperson (2017) అవార్డు అందుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్
47) ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారి నివేదికను ఐక్యరాజ్యసమితి ఏ పేరుతో విడుదల చేసింది ?
జ: ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG) 2018
48) సీ షెల్స్ దేశానికి ఇప్పటికే ఓ విమానాన్ని భారత్ బహుకరించింది. ఈనెల 29న మరో విమానాన్ని ఇవ్వనున్నారు. దాని పేరేంటి ?
జ: డోర్నియర్ విమానం
49) వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం థర్డ్ జనరేషన్ EVM లను సిద్ధం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటి తయారీ బాధ్యతను ఏయే సంస్థలకు అప్పగించింది ?
జ: ECIL (HYD), BEL ( BENGALORE)
50) ఎమర్జన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ - పేరుతో పుస్తకం రాసినది ఎవరు. ( ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు )
జ: ప్రసారభారతి ఛైర్మన్ ఎ.సూర్యప్రకాశ్
51) పాస్ పోర్టు సేవలను మరింత సరళతరం చేసేందుకు కొత్తగా తెచ్చిన యాప్ ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు. ఆ యాప్ పేరేంటి ?
జ: మొబైల్ పాస్ పోర్ట్ అప్లికేషన్
52) మెర్సర్ సంస్థ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ప్రపంచంలోనే ముంబై నగరం ఎన్నో స్థానం ఆక్రమించింది ?
జ: 55వ స్థానం
(నోట్: మొదటి స్థానం హాంకాంగ్ కి దక్కింది )
53) ప్రపంచంలోనే అతి తేలికైన ఉపగ్రహాన్ని చెన్నైకి చెందిన యువకులు రూపొందించారు. దాని బరువు ఎంత ?
జ: 33 గ్రాములు
(నోట్: చెన్నైలోని హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) లో ఇంజనీరింగ్ చదువుతున్న హరికృష్ణన్, అమర్ నాథ్; గిరి ప్రసాద్, సుధీ రూపొందించారు )
54) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్
(నోట్: రాధాకృష్ణన్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు)
55) తులసి మొక్క నుంచి క్యాన్సర్ ఔషధాన్ని తయారు చేస్తున్న సంస్థ ఏది ?
జ: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ( NIT)
56) దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: నాలుగో స్థానం
(నోట్: 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 7.19 శాతం మంది తెలుగును మాతృభాషగా ఎంచుకున్నారు. గతంలో తెలుగు మూడో స్థానంలో ఉండేది )
57) తెలంగాణలో వాతావరణం గురించి తెలుసుకునేందుకు మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేసిన యాప్ పేరేంటి ?
జ: టీఎస్ వెదర్ యాప్
(నోట్: ఈ యాప్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పనిచేస్తుంది )
58) WE HUB ని విస్తరించండి?
జ: Women Entrepreneurs Hub
59) తప్పిపోయిన చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేర్చేందుకు ఉపయోగపడే ఏ యాప్ ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీలో ప్రారంభించారు ?
జ: రీ యునైట్
60) 2018-19, 2019-20ల్లో భారత ఆర్థిక వృద్ధి ఎంత శాతంగా ఉంటుందని IMF తెలిపింది ?
జ: 7.4 శాతం, 7.8శాతం

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/