Thursday, September 19

JULY 2018 TOP – 60 (1st PART)

01) హైదరాబాద్ జోన్ పరిధిలోని పరిశ్రమల్లో అత్యధిక జీఎస్టీ చెల్లింపుదారుగా నిలిచిన ఏ పరిశ్రమకు అవార్డును ప్రదానం చేశారు ?
జ: సింగరేణి
(నోట్: 2017 జులై 1నుంచి 2018 మార్చి 18 వరకూ రూ.2,100 కోట్ల జీఎస్టీని సింగరేణి చెల్లించింది )
02) 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా నెలకు సగటున ఎంత మొత్తం వసూలైనట్టు ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ?
జ: రూ.89,885 కోట్లు
03) ప్రస్తుత ఖరీఫ్ కాలంలో క్వింటాల్ వరి ధాన్యం మద్దతు ధరను ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.1750
(నోట్: ప్రస్తుతం సాధారణ రకం రూ.1550/- , ఏ గ్రేడ్ రకం రూ.1590 గా ఉంది )
04) ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించిన యాప్ ఏది ?
జ: సీవిజిల్ ( సిటిజన్స్ విజిల్ )
05) జీడీపీ గణాంకాలను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ (ఆధార సంవత్సరం) 2011-12. దీన్ని ఏ ఏడాదికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2017-18
06) ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
జ: నాలుగో స్థానం ( 2.26 లక్షల కోట్ల డాలర్లు )
(నోట్: మొదటిది : అమెరికా 18.57 లక్షల కోట్ల డాలర్లు, రెండోవది చైనా: 11.2 ల.కో.డా, మూడోవది జపాన్ : 4.94.లక్షల కోట్ల డాలర్లు )
07) మొండి బకాయిల సమస్యతో పోరాడేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన కమిటీ ఏది ?
జ: సునీల్ మెహతా
08) షేర్లలో 6 వారాలకు పైగా ట్రేడింగ్ సస్పెండ్ కావడంతో ఎన్ని కంపెనీలను డీలిస్ట్ చేస్తున్నట్టు బాంబే స్టాక్ ఎక్చేంజ్ (BSE) ప్రకటించింది ?
జ: 222
09) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఎవరు ?
జ: రికీ పాంటింగ్
10) బాలల అదృశ్యం కేసులు, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, బాల కార్మిక వ్యవస్థకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది ?
జ: ఆపరేషన్ ముస్కాన్
11) గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది ?
జ: గిరిబాల వికాస్
12) తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?
జ: సెప్టెంబర్ 9
13)ఇటీవల తరుచుగా వినిపిస్తున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే పదం ఏ శాఖకు సంబంధించింది ?
జ: న్యాయశాఖకు
(నోట్: సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులో భారత ప్రధాన న్యాయమూర్తిదే అని చెప్పడానికి ఉద్దేశించిన పదం ఇది )
14) 2018 పిఫా ప్రపంచ కప్ లో పాల్గొంటున్న జట్ల సంఖ్య ఎంత ?
జ: 32
15) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
16) బొగ్గు గనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ఏది ?
జ: ఖాన్ ప్రహరి
17) రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ప్రారంభమైంది
జ: ములుగు (గజ్వేల్ నియోజకవర్గం)
18) థాయ్ లాండ్ లో 12 మంది చిన్నారులతో పాటు ఫుట్ బాల్ కోచ్ చిక్కుకు పోయిన గుహ పేరేంటి ?
జ: తామ్ లుయాంగ్ గుహ
19) రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలను కల్పన, పెంపుదల కోసం ఏర్పాటు చేసిన టాస్క్ యొక్క పూర్తి పేరేంటి ?
జ: Telangana Academy for Skill Knowledge
20) విన్నింగ్ లైక్ సౌరవ్ : థింక్ అండ్ సక్సీడ్ లైక్ గంగూలీ - పుస్తకాన్ని రచించింది ఎవరు ?
జ: అభిరూప్ భట్టాచార్య
21) పబ్లిక్ ఓటింగ్ ద్వారా బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పుస్తకం ఏది ?
జ: ద ఇంగ్లిష్ పేషెంట్ ( రచయిత మైకేల్ అందాజీ - కెనడా )
22) 2017 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన స్టేట్ బిజినెస్ రిఫామ్స్ అసెస్ మెంట్ కింద తెలంగాణకి ఎన్నో ర్యాంకు వచ్చింది ?
జ: రెండో ర్యాంక్ (98.33శాతం)
23) ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులను ఈసారి ఏ పేరుతో ప్రకటించారు ?
జ: స్టేట్ బిజినెస్ రిఫామ్స్ అసెస్ మెంట్
24) ఆర్టీసీ కార్మికులకు సకల జనుల సమ్మెకాలాన్ని సాధారణ సెలవుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సకలజనుల సమ్మె ఎప్పుడు జరిగింది ?
జ: 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకూ
25) తెలంగాణలో ప్రతి యేటా జులై 11న ఇంజినీర్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎవరి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహిస్తారు ?
జ: ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ జంగ్ (141 వ జయంతి)
26) ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
జ: మొదటి స్థానం
27)సాధారణ రైలు టిక్కెట్లు కూడా ఇంటి నుంచే పొందేలా కొత్త మొబైల్ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెస్తోంది. దాని పేరేంటి ?
జ: యూటీఎస్ ఆన్ మొబైల్
28) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ ) పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు ?
జ: స్పోర్ట్స్ ఇండియా
(నోట్: 1984లో సాయ్ ను ఏర్పాటు చేశారు )
29) 2017లో ప్రపంచ దేశాల జీడీపీ ఆధారంగా ప్రపంచ బ్యాంక్ రూపొందించిన జాబితాలో భారత్ ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ?
జ: ఆరవ ( 2.59లక్షల కోట్ల డాలర్లు - దాదాపు రూ.176.12 లక్షల కోట్లు)
30) అంతర్జాతీయ ద్రవ్యనిధి గత ఏప్రిల్ లో రిలీజ్ చేసిన అంచనాల ప్రకారం భారత్ జీడీపీ ఎంతగా ఉంది ?
జ: 2.61లక్షల కోట్ల డాలర్లు