Friday, February 21

JULY 2018 TOP – 50 (2nd PART)

01) మొబైల్ సిమ్ తో పనిలేకుండా వింగ్స్ యాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోడానికి దేశంలోనే మొదటిసారిగా సేవలను మొదలుపెడుతున్న సంస్థ ఏది ?
జ: BSNL
02) రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ పథకాల్లో లబ్దిదారులకు ఎంతమొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది ?
జ: రూ.1,00,116లు
(నోట్: 2014లో పథకం ప్రారంభించినప్పుడు రూ.51వేలు, 2017లో రూ.75,116లు ఇచ్చేవారు )
03) గిరిజ్యోతి పురస్కార గ్రహీత జంగుబాయి కుమురం భీం జిల్లా సిర్పూర్ లో చనిపోయారు. ఆమె ఏ రంగంలో కృషి చేశారు ?
జ: గిరిజనుల్లో చైతన్యానికి( ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందించిన మొదటి ఆదివాసీ మహిళగా గుర్తింపు) (2010లో ఆమెకు గిరిజ్యోతి పురస్కారం లభించింది )
04)గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది ?
జ: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2018
05) అల్యూమినియం : ది ఫ్యూచర్ మెటల్ : గ్రంథ కర్త ఎవరు?
జ: తాపన్ కుమార్ ఛంద్
06) రఘునాధ్ మహాపాత్రను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయన ఏ రంగానికి చెందిన వారు ?
జ: శిల్ప కళ
07) చిన్నారులకు సమగ్ర టీకాలు అందించే కార్యక్రమం రాష్ట్రంలో 2015 నుంచి 4 విడతల్లో ఇప్పటిదాకా అమలు చేశారు. ఈ కార్యక్రమం పేరేంటి ?
జ: ఇంద్ర ధనుష్
08)ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్ 100 సెలబ్రిటీల్లో భారత్ నుంచి ఎవరికి చోటు దక్కింది ?
జ: అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్
09) బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎవరు నిలిచారు ?
జ: జెఫ్ బెజోస్ ( 150 బిలియన్ డాలర్లు. అంటే 10,26,600 కోట్ల రూపాయలు)
10) పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పటిదాకా ఎన్ని సార్లు ప్రవేశపెట్టారు?
జ: 26 సార్లు (మొదటిసారి 1963లో ప్రవేశపెట్టారు )
11) కొత్త వంద రూపాయల నోటుపై ఉండే రాణి కీ వవ్ చిత్రం ఎక్కడ ఉంది ?
జ: గుజరాత్ లోని సరస్వతి నది తీర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కట్టడం
12) ది హౌజ్ ఆఫ్ ఇస్లాం : ఎ గ్లోబల్ హిస్టరీ పుస్తకం రాసింది ఎవరు ?
జ: ఈద్ హుస్సేన్
13) శ్రీలంకలో 1984లో నిర్మించిన ఏ అంతర్జాతీయ స్టేడియాన్ని కూల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గాలె అంతర్జాతీయ స్టేడియం
(నోట్: 2004లో వచ్చిన సునామీకి స్టేడియం బాగా దెబ్బతిన్నది )
14) ఇప్పచెట్టు నీడలో - అంటూ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులతో తన అనుభవాలను పుస్తక రూపంలో ఉంచి IAS అధికారి ఎవరు ?
జ: డాక్టర్ శ్రీనివాసులు దాసరి
15) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద ఒక్కో ఎంపీ 2016లో ఒక గ్రామం, 2019లో 2 గ్రామాలు దత్తత తీసుకోవాలి. 2024లో ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి ?
జ: ఐదు గ్రామాలు
16) వస్తు సేవల పన్ను (జీఎస్టీలో) ఇటీవల కొన్ని శ్లాబులను సవరించడంతో ప్రస్తుతం 28శాతం పన్ను రేటులో ఎన్ని వస్తువులు మిగిలాయి ?
జ: 35 వస్తువులు (గతంలో 191 వస్తువులు ఉండేవి)
17) బాలికల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజనలో ఏటా జమ చేసే కనీస మొత్తాన్ని ఎంతకు తగ్గించారు ?
జ: రూ.250 లకు (గతంలో రూ.1000గా ఉండేది )
18) సూర్యుడి గురించి లోతుగా అధ్యయనం చేసేందుకు 2018 ఆగస్టు 6న ఏ వ్యోమ నౌకను సానా ప్రయోగించనుంది ?
జ: పార్కర్ సోలార్ ప్రోబ్
19) దేశంలోనే మొదటిసారిగా నేరస్తులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని అవలంభించబోతోంది ?
జ: ఫేషియల్ డేటా బేస్ (ముఖ కవళికల సమాచార నిధి)
20) భారత్ స్టేజ్ - 6 (BS 6) ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల తయారీ, విక్రయాలను మనదేశంలో ఎప్పటి నుంచి అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2020 ఏప్రిల్ 1 నుంచి
21) పౌరుల్లో బాల్యం నుంచే సైన్స్ పై ఆసక్తి పెంచి సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఏది ?
జ: ఇన్ స్పైర్ మానక్
22) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ఇచ్చే పురస్కారానికి ఈ ఏడాదికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: డాక్టర్ పెన్నా శివరామకృష్ణ
23) గొర్రెల అభివృద్ధి పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ , ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2017 జూన్ 20న సిద్ధిపేట జిల్లా కొండపాకలో
24) దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణ, వాటితో మోసపోకుండా ఉండేందుకు కేంద్ర హోంశాఖ తెచ్చిన ట్విట్టర్ ఖాతా పేరేంటి ?
జ: సైబర్ దోస్త్ ( @cyber dost)
25) బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచారం ఉద్యమంలో భాగంగా వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పుస్తకం పేరేంటి ?
జ: మై బాడీ ! వాట్ ఐ సే గోస్ ( నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది )
26) రాష్ట్రంలో ఎన్ని కులాలను అత్యంత వెనుకబడిన కులాలు (MBC) లుగా ప్రభుత్వం గుర్తించింది ?
జ: 36 కులాలను
(నోట్ : వీరిని బీసీ-ఎలుగా గుర్తిస్తారు )
27) రామన్ మెగసెసె అవార్డుకి ఎంపికైన మానసిక వైద్య నిపుణుడు భరత్ వట్వానీ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: సామాజిక సేవ (మానసిక వైద్య నిపుణుడు)
28) తెలంగాణ తొలితరం గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు రాంజీగోండు గిరిజన మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: హైదరాబాద్ బాపూ ఘాట్ లోని ఎకరన్నర స్థలంలో
29) అసోంలో విడుదలైన జాతీయ పౌర నమోదు కార్యక్రమంలో దాదాపు ఎంతమందికి చోటు దక్కలేదు ?
జ: 40.07 లక్షల మంది
30) లాస్ ఏంజెల్స్ లో జరిగిన మూడో లవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018 లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన అస్సామీ మూవీ ఏది ?
జ: Xhoihobote Dhemalite