Tuesday, August 11

JULY CURRENT AFFAIRS QUIZ – 5

రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు. తెలుగులో రాసుకునే అవకాశం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి :http://telanganaexams.com/bank-pos-clerks-telangana-andhra-pradesh-posts/

1. ఢిల్లీలో ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా హాస్పిటల్ ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి

ఎ) 2020 జులై 5న సౌత్ ఢిల్లీలోని ఛతర్ పూర్ ఏరియాలో 10 వేల బెడ్ల కెపాసిటీతో నిర్మించిన ఈ కరోనా హాస్పిటల్ ను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు

బి) దాదాపు 20 ఫుట్ బాల్ గ్రౌండ్స్ అంత వైశాల్యంలో ఈ హాస్పిటల్ ఉంది

సి) 2వేల మంది ITBP, సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్సెస్ కు చెందిన డాక్టర్లు, సిబ్బంది సేవల అందిస్తున్నారు

2. 250 మిలియన్ ఏళ్ళ నాటి ఏనుగు శిలాజాలు తెలంగాణలోని ఎక్కడి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బయటపడ్డాయి ?

3. పెద్ద ఎత్తున వర్మీ కాంపోస్ట్ ఉత్పత్తి కోసం కిలో పేడను రూపాయిన్నరకు కొనుగోలు చేయాలని  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

4. దేశంలో రూపొందించిన మొదటి సోషల్ మీడియా సూపర్ యాప్ ఎలిమెంట్స్ ను 2020 జులై 5న ఎవరు ప్రారంభించారు ?

5. తెలంగాణలో ఏ సాఫ్ట్ వేర్ నిర్వహణ ద్వారా ఆన్ లైన్ పాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

6. విద్యార్థులు, టీచర్లకి డిజిటల్ సేఫ్టీ, ఆన్ లైన్ వెల్ బీయింగ్, అగ్ మెంటెడ్ రియాలిటీ లాంటి సేవలను అందించేందుకు ఏ టెక్ దిగ్గజంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE) జత కట్టింది ?

7. ఏ దేశంలో ప్రవాసీ కోటా బిల్లు తేవడం వల్ల 8 లక్షల మంది ఇండియన్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది ?

8. రైతాంగం కోసం దేశంలోనే మొదటిసారిగా ఎన్నివేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?

9. ప్రభుత్వ రంగంలో నైపుణ్యాభివృద్ధి పరిపాలనా కేంద్రంతో పాటు 30 చోట్ల నైపుణ్య శిక్షణా కాలేజీలను దేశంలోని ఏ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు ?

10. భారత్ లో ఏప్రిల్, మే నెలల్లో నిరుద్యోగ రేటు 23 శాతంగా ఉండగా... జూన్ నెలలో ఎంతకు చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ డేటా వెల్లడించింది ?


 

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en