Saturday, August 15

JULY CURRENT AFFAIRS QUIZ 3

1. 2020 డిసెంబర్ కల్లా దేశంలోని ఏ రెండు రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్టుల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్టు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది ?

2. భారతీయ జాతీయ చెల్లింపుల సంస్థ ( NPCI ) రూ.500 కోట్లతో నిర్మించనున్న అధునాతన డేటా కేంద్రానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  దీంతో నెలకు 4 వేల మిలియన్ల లావాదేవీలతో రూ.15 లక్షల కోట్ల చెల్లింపుల సామర్థ్యంతో హైదరాబాదఓ అతి పెద్ద డిజిటల్ చెల్లింపుల కేంద్రాల్లో ఒకటిగా మారబోతోంది. హైదరాబాద్ లో ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ?

3. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 యొక్క థీమ్ Yoga for Health – Yoga at Home… ప్రతి యేటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

4. 2020 యోగా డే (జూన్ 21) ఆయూష్ మంత్రిత్వ శాఖ యొక్క థీమ్ ఏంటి ?

5. 2023 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్ళు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  తక్కువ ధరలో మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే శాఖ చెబుతోంది.  ప్రస్తుతం రైల్వే బోర్డు ఛైర్మన్ ఎవరు ?

6. గతంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిగా పనిచేసి, ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల సంయుక్త కార్యదర్శిగా ఉన్న 1993 IFS బ్యాచ్ అధికారి బి. బాల భాస్కర్ ను ఏ దేశ రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు ?

7. జూన్ లో అమెరికా సంస్థలు ఆ దేశంలో కొత్తగా 48 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. దాంతో నిరుద్యోగ రేటు ఎంత శాతానికి తగ్గింది ?

8. వీథి వ్యాపారులకు ఉద్దేశించిన PM SVANidhi (Prime Minister Street Vendor’s Atma Nirbhar Nidhi) కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతను SIDBI ( Small Industries Development Bank of India) చేపట్టింది.  అయితే ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది

9. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (అంతర్జాతీయ ఆహార కార్యక్రమం) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

10. చైనాతో సరిహద్దు వివాదం, ఉద్రిక్తతల కారణంగా భారత్ అధునాతన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?

ఎ) రూ.38,900 కోట్ల ఖర్చుతో అధునాతన అగ్రశ్రేణి విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

బి) రష్యా నుంచి 21 మిగ్ 29 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం భారత్ దగ్గరున్న 59 విమానాలను ఆధునీకరిస్తారు

సి) ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే 248 అస్త్ర క్షిపణులను సమీకరించుకుంటారు. సుఖోయ్ 30 యుద్ధ విమానాలకు వీటిని అనుసంధానిస్తారు

డి) శత్రువులపైకి ఏకధాటిగా రాకెట్లను ప్రయోగించే పినాక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తారు.  ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తాజా ప్రాజెక్టుల్లో రూ.31,130 కోట్ల విలువైన కాంట్రాక్టులు దేశీయ పరిశ్రమలకే దక్కుతాయి.


 

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en