Tuesday, July 7

JULY CURRENT AFFAIRS -1

1. ఢిల్లీ బేస్డ్ ఫైనాన్షియల్ స్టార్టప్ సంస్థ అఫర్డ్ ప్లాన్ తో కలసి ఆరోగ్య అవవసరాల కోసం స్వస్త్ కార్డ్ ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది ?

2. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?

3. ఆహార ధాన్యాల నిల్వ, సరఫరా విషయంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (UN-WFP) ఇండియాతో కలసి పనిచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( IIT) ఏది ?

4. టాటా సన్స్ కు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్ ఇటీవలే RBI సెంట్రల్ బోర్డ్ లో పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్ గా తిరిగి నియమితులయ్యారు.  RBI సెంట్రల్ బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారు ?

5. “Legend of Suheldev: The King Who Saved India” అనే పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరు ?;

6. దేశంలోని వలస కూలీల సంక్షేమానికి రూ.50వేల కోట్లతో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన స్కీమ్ ను ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ప్రారంభించారు.  అయితే ఈ పథకాన్ని నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ?

7. దేశంలోని 8 ఈశాన్య రాష్ట్రాల్లో వైద్యం, ఆరోగ్య వసతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంత మొత్తాన్ని కేటాయించింది ?

8. ఇటీవల మరణించిన రాజీందర్ గోయెల్ ఏ క్రీడకు సంబంధించిన వారు ?

9. వ్యోమగాములు అంతరిక్షంలో ఉపయోగించే లిక్విడ్ కూలింగ్ అండ్ హీటింగ్ గార్మెంట్ ( LCHG) విషయంలో ఇస్రోకి పేటెంట్ హక్కులు ఇటీవలే లభించాయి.  గగన్ యాన్ ప్రాజెక్ట్ ద్వారా ఏ ఏడాదిలో మానవులను అంతరిక్షానికి పంపేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది ?

10. దేశంలో పర్యావరణ సమతౌల్యానికి సహాయపడేందుకు ఏ పబ్లిక్ రంగ సంస్థ ఇటీవల నీతి ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ కు తో జతకలిసింది ?


 

తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en

 

ఫ్రెండ్స్ : చిన్న రిక్వెస్ట్ 

నాకు గత నెలలో కోవిడ్ పాజిటివ్ వైరస్ ఎటాక్ అయింది.  అందువల్ల దాదాపు 20 రోజులకి పైగా మీకు అందుబాటులో లేకుండా పోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.  ఇప్పటి నుంచి మన వెబ్ సైట్స్, యాప్స్ అన్నీ అప్ డేట్ చేయడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తాను.  Please understand ( విష్ణుకుమార్ ఎం. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఎగ్జామ్స్ )